SP RATHNA: పటిష్ట నిఘాతో నేరాలు తగ్గుముఖం
ABN , Publish Date - Dec 30 , 2024 | 11:58 PM
క్షేత్రస్థాయిలో పటిష్ట నిఘా, ముందస్తు చర్యలతో ఈఏడాది నేరాలు తగ్గాయని ఎస్పీ రత్న పేర్కొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని కాన్ఫరెన్స హాల్‌లో 2024కి సంబంధించిన పోలీసు వార్షిక నివేదికను సోమవారం ఎస్పీ వెల్లడించారు.
మహిళల భద్రతకు పెద్దపీట: ఎస్పీ రత్న
2024 వార్షిక నేర నివేదిక విడుదల
పుట్టపర్తి రూరల్, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): క్షేత్రస్థాయిలో పటిష్ట నిఘా, ముందస్తు చర్యలతో ఈఏడాది నేరాలు తగ్గాయని ఎస్పీ రత్న పేర్కొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని కాన్ఫరెన్స హాల్‌లో 2024కి సంబంధించిన పోలీసు వార్షిక నివేదికను సోమవారం ఎస్పీ వెల్లడించారు. జిల్లాలో గతేడాదితో పోలిస్తే ఈసారి 31.9 శాతం నేరాలు తగ్గాయన్నారు. పోలీసుల సమష్టి కృషి, అంకితభావంతో పనిచేయడం కారణంగానే ఇది సాధ్యమైందన్నారు. సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించగలిగామన్నారు.
ఫ పేకాట, మట్కాపై ఉక్కుపాదం మోపి, 627 కేసులు నమోదుచేయడంతోపాటు 2757 మందిని అరెస్టు చేశామన్నారు.
ఫ గంజాయి స్థావరాలపై డ్రోన్ల సాయంతో దాడులు చేసి, 13 కేసులు నమోదు చేసి, 36 మందిని అరెస్టు చేశామన్నారు. మొత్తం 24.1 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నామన్నారు.
ఫ మద్యం అక్రమ రవాణాకు సంబంధించి 1118 కేసులు నమోదు చేసి, 1161 మందిని అరెస్టు చేశామన్నారు.
ఫ ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసులు గతేడాది 107 నమోదుకాగా.. ఈసారి 102 నమోదయ్యాయన్నారు.
ఫ పదేపదే నేరాలకు పాల్పడుతున్న నలుగురిపై పీడీయాక్టు ప్రయోగించి, వివిధ నేరాలకు పాల్పడుతున్న 126 మందిపై హిస్టరీ షీట్ష్ ఓపెన చేశామన్నారు.
ఫ గతేడాది 544 రోడ్డు ప్రమాదాలు జరగ్గా.. ఈసారి 550 జరిగాయన్నారు.
ఫ లోక్ అదాలత ద్వారా 3119 కేసులకు పరిష్కారం చూపగలిగామన్నారు.
ఫ సెల్‌ఫోన్ల చోరీకి సంబంధించి 667 ఫిర్యాదులు రాగా.. రూ.80.25 లక్షల విలువైన 580 ఫోన్లను రికవరీ చేసి, ఫిర్యాదుదారులకు అందజేశామన్నారు.