CROP INSURANCE: పంటల బీమాను వెంటనే ప్రకటించాలి
ABN , Publish Date - Aug 18 , 2024 | 12:13 AM
2023 సంవత్సరానికి సంబంధించి పంటల బీమాను వెంటనే ప్రకటించాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం ఆర్ అండ్‌బీ అతిథిగృహంలో ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
అనంతపురం కల్చరల్, ఆగస్టు 17: 2023 సంవత్సరానికి సంబంధించి పంటల బీమాను వెంటనే ప్రకటించాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం ఆర్ అండ్‌బీ అతిథిగృహంలో ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఆయన మాట్లాడుతూ... 2023 ఖరీఫ్, రబీలో తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొన్నాయన్నారు. రైతులు వేసిన పంటలు పూర్తిగా దెబ్బతిని నష్టపోయారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 2023 ఖరీ్‌ఫలో 28 మండలాలను, రబీలో 14 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించినప్పటికీ కరువు నివారణకు ప్రత్యేకంగా నిధులు కేటాయించలేదన్నారు. వెంటనే ప్రత్యేక నిధులు కేటాయించి, ప్రభుత్వం ప్రకటించిన పెట్టుబడి సాయం వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలన్నారు. ఏపీ రైతుసంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మధుసూదన, శివారెడ్డి, పోతులయ్య, చంద్రశేఖర్, దేవేందర్‌రెడ్డి, సుబ్బయ్య, నాగేంద్ర పాల్గొన్నారు.