GUGUDU KULLAISWAMY : పోటెత్తిన భక్తజనం
ABN , Publish Date - Jul 14 , 2024 | 11:44 PM
ప్రసిద్ధిగాంచిన గూగూడు కుళ్లాయిస్వామి చిన్నసరిగెత్తు కార్యక్రమం ఆదివారం కన్నుల పండువగా జరిగింది. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో గూగూడు కిక్కిరిసి పోయింది. ఈ సందర్భంగా కుళ్లాయిస్వామిని దర్శించుకుని చక్కెర చది వింపులు, ఫతేహాలు నిర్వహించారు...
కన్నుల పండువగా గూగూడు కుళ్లాయిస్వామి చిన్నసరిగెత్తు
నార్పల, జూలై 14: ప్రసిద్ధిగాంచిన గూగూడు కుళ్లాయిస్వామి చిన్నసరిగెత్తు కార్యక్రమం ఆదివారం కన్నుల పండువగా జరిగింది. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో గూగూడు కిక్కిరిసి పోయింది. ఈ సందర్భంగా కుళ్లాయిస్వామిని దర్శించుకుని చక్కెర చది వింపులు, ఫతేహాలు నిర్వహించారు.
ఆంజనేయస్వామి ఆలయంలో కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. క్యూలైన ఎక్కువగా ఉండటంతో చాలా మంది భక్తులు ఆంజనేయస్వామి దర్శనం కాక వెనుదిరిగి వెళ్లిపోయారు. మంగళవారం పెద్ద సరిగెత్తు, బుధవారం జలధి కార్యక్రమం నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....