TDP: అభివృద్ధికి పట్టం కట్టండి: అశ్మితరెడ్డి
ABN , Publish Date - May 04 , 2024 | 10:57 PM
ఎన్నికల్లో సైకిల్‌గుర్తుకు ఓటువేసి అభివృద్ధికి పట్టం కట్టాలని కూటమి అభ్యర్థి జేసీ అశ్మితరెడ్డి పిలుపునిచ్చారు. మండలంలోని ఆలూరు, సజ్జలదిన్నె, బుగ్గ, ఇగుడూరు, చుక్కలూరు గ్రామాల్లో శనివారం ఆయన రోడ్‌షో, బహిరంగ సభలు నిర్వహించారు.
తాడిపత్రిటౌన, మే 4: ఎన్నికల్లో సైకిల్‌గుర్తుకు ఓటువేసి అభివృద్ధికి పట్టం కట్టాలని కూటమి అభ్యర్థి జేసీ అశ్మితరెడ్డి పిలుపునిచ్చారు. మండలంలోని ఆలూరు, సజ్జలదిన్నె, బుగ్గ, ఇగుడూరు, చుక్కలూరు గ్రామాల్లో శనివారం ఆయన రోడ్‌షో, బహిరంగ సభలు నిర్వహించారు. సభల్లో ఆయన మాట్లాడుతూ చాలా గ్రామాల్లో తాగు, సాగునీటితోపాటు విద్యుత సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మొదట ఈ సమస్యలపై దృష్టిపెట్టి పరిష్కరిస్తానన్నారు. కొన్ని గ్రామాల్లో సీసీరోడ్లు లేక బస్సు రావడం లేదన్నారు. ఐదేళ్లలో పాలకులు చేసింది ఏమి లేదని ఆరోపించారు. 2014 టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధే తప్ప ప్రస్తుతం ఏమీ కనిపించడం లేదన్నారు. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం రావడం ఖాయమన్నారు. ప్రతి గ్రామంలో ఆయనకు మహిళలు పెద్దఎత్తున బ్రహ్మరథం పట్టారు. ఆలూరు గ్రామంలో పలువురు వైసీపీ మద్ధతుదారులు టీడీపీలో చేరారు. తిరుపాల్‌రెడ్డి, సుబ్బయ్య, గంగాధర్, ఆదినారాయణ, సురేష్, హరినాథ్‌రెడ్డి, పవనకుమార్‌రెడ్డి, సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.
టీడీపీలో చేరికలు: మండలంలోని బుగ్గ, అయ్యవారిపల్లి గ్రామాల్లోని వైసీపీకి చెందిన 40కుటుంబాలు శనివారం మున్సిపల్ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీలో చేరాయి. పార్టీలో చేరిన వారికి ఆయన కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అంతకుమునుపు జేసీ ప్రభాకర్‌రెడ్డికి గ్రామస్థులు ఘనంగా స్వాగతం పలికారు. మార్కెట్‌యార్డు మాజీ చైర్మన ఎంఏ రంగారెడ్డి, వెంకటరెడ్డిపల్లి రామకృష్ణారెడ్డి, అభిరుచి నారాయణరెడ్డి, గోరా పాల్గొన్నారు.
జగన మళ్లీ వస్తే మీ భూములు మీవి కావు..
యాడికి: జగన మళ్లీ అధికారంలోకి వస్తే మీ భూములపై మీకు ఎలాంటి హక్కులు ఉండవని మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని చిక్కేపల్లి, బోయరెడ్డిపల్లి గ్రామాల్లో పలువురు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. దివాకర్‌రెడ్డి వారికి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఆయన వెంట క్లాస్-1 కాంట్రాక్టర్ చవ్వా గోపాల్‌రెడ్డి, టీడీపీ మండల కన్వీనర్ రుద్రమనాయుడు, టీడీపీ నాయకులు నాగిరెడ్డి, దివాకర్‌రెడ్డి, పేరం రవి, సుధాకర్‌రెడ్డి ఉన్నారు.
టీడీపీ అభ్యర్థిని గెలిపించండి
పెద్దపప్పూరు: టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి జేసీ అశ్మితరెడ్డిని గెలిపించాలని ఆ పార్టీ నాయకుడు కాకర్ల రంగనాథ్ ఓటర్లను కోరారు. శనివారం మండలంలోని వరదాయపల్లి, ముచ్చుకోట గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
నేడు పెద్దవడుగూరులో..: టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జేసీ అశ్మితరెడ్డి ఆదివారం పెద్దవడుగూరులో రోడ్‌షో, బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు మండల కన్వీనర్ కొండూరు కేశవరెడ్డి శనివారం ప్రకటనలో తెలిపారు. 3:30గంటలకు అప్పేచర్ల, 4:30గంటలకు కిష్టిపాడు, 5:30గంటలకు లక్షుంపల్లి, 6:30గంటలకు పెద్దవడుగూరులో సభ ఉంటుందన్నారు.