దగ్గుబాటి వినూత్న ప్రచారం
ABN , Publish Date - Apr 28 , 2024 | 12:29 AM
అనంత అర్బన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వరప్రసాద్ వినూత్నంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.
అనంతపురం అర్బన, ఏప్రిల్ 27 : అనంత అర్బన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వరప్రసాద్ వినూత్నంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం ఉదయం నగరంలోని న్యూటౌన జూనియర్ కళాశాల, ఎస్‌ఎస్‌బీఎన కళాశాల మైదానాల్లో వాకర్స్, క్రీడాకారులను ఆయన కలిశారు. అలాగే కోర్టు రోడ్డు, ఆదిమూర్తి నగర్‌లోని పలు టీ కేఫ్, టిఫెన సెంటర్లల్లో ప్రచారం చేశారు. ‘ నేను మీలో ఒక్కడిలా వచ్చాను.. మీ వాడిగా మీతో ఉంటాను... ప్రతి అంశాన్ని రాజకీయంతో ముడిపెట్టలేము.. ఒక సామాన్యుడిగా మీ వద్దకు వచ్చాను..’ అని దగ్గుబాటి వారితో అన్నారు. అలాగే శనివారం సాయంత్రం టవర్‌క్లాక్ నుంచి సప్తగిరి సర్కిల్ వరకూ ఆయన ప్రచారం నిర్వహించారు.
క్రిస్టియన్ల ఆత్మీయ కలయిక
స్థానిక రాంనగర్‌లోని ఓ ఫంక్షన హాల్‌లో టీడీపీ క్రిస్టియన సెల్ రాష్ట్ర అధ్యక్షుడు స్వామిదాస్ ఆధ్వర్యంలో క్రిస్టియన్ల ఆత్మీయ కలయిక కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంత అర్బన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుబాటి ప్రసాద్, ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణలు ముఖ్యఅతిధులుగా హాజరయ్యారు. క్రిస్టియన్లకు జగనరెడ్డి తీరని అన్యాయం చేశారని దగ్గుబాటి ప్రసాద్ మండిపడ్డారు. టీడీపీ గెలుపు కోసం పాస్టర్స్ అందరూ సహకరించి, ఎన్డీయే కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో జనసేన జిల్లా ఉపాధ్యక్షుడు అంకే ఈశ్వరయ్య, పాస్టర్ బిషప్ శామ్యుల్ శ్రీనివాస్, పాస్టర్ కృపాదాస్ పాల్గొన్నారు.
మరిన్ని వార్తల కోసం...