Share News

THRETEN: తమ్ముడినుంచి ప్రాణహాని

ABN , Publish Date - Jul 22 , 2024 | 11:33 PM

తనకు, కుమార్తె, అల్లుడికి తమ్ముడి నుంచి ప్రాణహాని ఉందని, ఇదివరకే గొడ్డలితో నరికిన అతన్ని ఊరి నుంచి బహిష్కరించాలని మహబూబ్‌బీ అనే మహిళ ఎస్పీ కేవీ మురళీకృష్ణను కోరారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాస్పందనలో ఎస్పీని కలిసి అర్జీ ఇచ్చారు.

THRETEN: తమ్ముడినుంచి ప్రాణహాని
Talking Mahbubbi

ఎస్పీకి మహిళ వినతి

అనంతపురం క్రైం, జూలై 22: తనకు, కుమార్తె, అల్లుడికి తమ్ముడి నుంచి ప్రాణహాని ఉందని, ఇదివరకే గొడ్డలితో నరికిన అతన్ని ఊరి నుంచి బహిష్కరించాలని మహబూబ్‌బీ అనే మహిళ ఎస్పీ కేవీ మురళీకృష్ణను కోరారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాస్పందనలో ఎస్పీని కలిసి అర్జీ ఇచ్చారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. తాడిపత్రికి చెందిన తాను 2021 మే 17న కుమార్తెను పెనకచెర్ల డ్యాంకు చెందిన అబ్దుల్‌ రెహమానకు ఇచ్చి వివాహం చేశానన్నారు. ఏడుగురు సోదరులు, నలుగురు అక్కచెల్లెళ్లు కలిసి తనపై కుట్ర పన్ని భర్తతో విడాకులిప్పించే ప్రయత్నం చేశారన్నారు. ఈ ఏడాది జనవరి 1న కుమార్తె, అల్లుడుంటున్న ఇంటికి కరెంట్‌ షాక్‌ ఇచ్చారని ఆరోపించారు. ఈనెల 9న ఆస్తి అంతా తమకే స్వాధీనం చేయాలని, లేదంటే మిమ్మల్ని చంపి జైలుకెళ్తానని తమ్ముడు షేక్‌ జిలానీ బాషా గొడ్డలితో నరికాడన్నారు. కోర్టు అతనికి రిమాండ్‌ విధించిందన్నారు. భవిష్యత్తులో అతని నుంచి ప్రాణహాని ఉందని ఎస్పీకి విన్నవించినట్లు తెలిపారు. అతన్ని ఊరి నుంచి బహిష్కరించడంతో పాటు అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ల నుంచి ప్రాణరక్షణ కల్పించాలని కోరారు.

Updated Date - Jul 22 , 2024 | 11:33 PM