Share News

Farmers : రైతులను మింగుతున్న అప్పులు

ABN , Publish Date - Aug 07 , 2024 | 12:37 AM

అన్నదాతల బలవన్మరణాలకు అడ్డుకట్ట పడటం లేదు. ఏ పంట పెట్టినా నష్టాలు వెంటాడుతుండటంతో దిక్కుతోచక ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. అప్పులు తీర్చేమార్గం లేక అర్ధంతరంగా వెళ్లిపోతున్నారు. జిల్లాలో మంగళవారం ఇద్దరు రైతులు ఉరి వేసుకోవం రైతాంగ సంక్షోభానికి అద్దం పడుతోంది. కంబదూరు మండ లం రాళ్ల అనంతపురం గ్రామానికి చెందిన దండా సురేష్‌(30), రాయదుర్గం మండలం టి.వీరాపురం గ్రామానికి చెందిన రైతు ఓబన్న(41) తోట పంటలను సాగుచేసి తీవ్రంగా నష్టపోయారు. లక్షలాది రూపాయల అప్పులు ...

Farmers : రైతులను మింగుతున్న అప్పులు

ఒకే రోజు ఇద్దరి బలవన్మరణం

రాయదుర్గం రూరల్‌/కళ్యాణ దుర్గం, ఆగస్టు 6: అన్నదాతల బలవన్మరణాలకు అడ్డుకట్ట పడటం లేదు. ఏ పంట పెట్టినా నష్టాలు వెంటాడుతుండటంతో దిక్కుతోచక ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. అప్పులు తీర్చేమార్గం లేక అర్ధంతరంగా వెళ్లిపోతున్నారు. జిల్లాలో మంగళవారం ఇద్దరు రైతులు ఉరి వేసుకోవం రైతాంగ సంక్షోభానికి అద్దం పడుతోంది. కంబదూరు మండ లం రాళ్ల అనంతపురం గ్రామానికి చెందిన దండా సురేష్‌(30), రాయదుర్గం మండలం టి.వీరాపురం గ్రామానికి చెందిన రైతు ఓబన్న(41) తోట పంటలను సాగుచేసి తీవ్రంగా నష్టపోయారు. లక్షలాది రూపాయల అప్పులు


పేరుకుపోవడంతో ఉరి వేసుకున్నారు. ఓబన్నకు రెండు ఎకరాల పొలం ఉంది. మరో మూడెకరాలను కౌలుకు తీసుకున్నాడు. టమోటా, కర్బూజ, బ్యాడిగి మిర్చి సాగు చేశాడు. పెట్టుబడి కోసం రూ.15 లక్షల వరకు అప్పు చేశాడు. దిగుబడి సరిగా రాకపోవడం, గిట్టుబాటు ధర లభించకపోవడంతో వడ్డీలు కూడా కట్టలేకపోయాడు. దిక్కుతోచక ఇంట్లో ఉరివేసుకున్నాడు. పోలీసులు మృతదేహాన్ని రాయదుర్గం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. భార్య ఈరమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని తెలిపారు.

తోట వద్ద ఉరి..

దండా సురే్‌షకు ఆరు ఎకరాల పొలం ఉంది. టమోటా, కర్బూజ పంటలను సాగు చేశాడు. పెట్టుబడుల కోసం బ్యాంకులు, వడ్డీ వ్యాపారుల వద్ద రూ.8 లక్షలకు పైగా అప్పులు చేశాడు. ఎంత శ్రమించినా గట్టెక్కలేకపోయాడు. తీవ్రంగా నష్టపోయి.. దిక్కుతోచని స్థితిని ఎదుర్కొన్నాడు. అప్పులు ఎలా తీర్చాలో తెలియడం లేదని ప్రతి రోజూ భార్య మంజుల వద్ద ఆవేదన వ్యక్తం చేసేవాడు. బతుకు భారాన్ని భరించలేక తోట వద్ద చెట్టుకు ఉరి వేసుకున్నాడు. చుట్టుపక్కల వారు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. చెట్టుకు వేలాడుతున్న భర్తను చూసి మంజుల గుండెలవిసేలా రోదించింది. ఇద్దరు కుమారులను ఎలా పెంచాలని, ఇక తమకు దిక్కెవరని కన్నీరుమున్నీరైంది. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తరఫున టీడీపీ నాయకుడు అల్లుడు ధర్మతేజ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Aug 07 , 2024 | 12:37 AM