Share News

దశాబ్దాలుగా ఇంటిపట్టాల కోసం నిరీక్షణ

ABN , Publish Date - Jul 27 , 2024 | 12:15 AM

వారంతా ఇళ్లు లేని నిరుపేదలు. దాదాపు 32 సంవత్సరాల క్రితం గాలివీడు గ్రామం నుంచి 35 కుటుంబాల వారు వలస వచ్చి తాడిమర్రిలో స్థిరపడ్డారు.

దశాబ్దాలుగా ఇంటిపట్టాల కోసం నిరీక్షణ
బాడుగకు నివాసముంటున్న రేకుల షెడ్లు

తాడిమర్రి, జూలై 26: వారంతా ఇళ్లు లేని నిరుపేదలు. దాదాపు 32 సంవత్సరాల క్రితం గాలివీడు గ్రామం నుంచి 35 కుటుంబాల వారు వలస వచ్చి తాడిమర్రిలో స్థిరపడ్డారు. వారి జీవనాధారం కోసం పండ్ల మొక్కలు అమ్ముకునేందుకు గుజరాత, రాజస్థాన రాష్ట్రాలకు ఏటా పురుషులు వలసవెళ్తారు. ఇతర రాష్ట్రాల్లో చెట్లను అమ్మ గా వచ్చిన లాభాన్ని తీసుకుని స్వగ్రామానికి వస్తుంటారు. మహిళలు మాత్రం ఇక్కడే ఉండి నర్సరీల్లో పనిచేసు కుంటూ జీవనం సాగిస్తుంటారు. మరికొంతమంది మహిళలు గాజుల వ్యాపారం చేస్తున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ధర్మవరం నియోజకవర్గానికి ఐదుగురు ఎమ్మెల్యేలు మారారు.


వచ్చిన వారంత తమకు ఓటు వేయండి.. పట్టా ఇస్తాం అంటారే కానీ ఏ ఒక్కరూ ఇవ్వలేదు. దీంతో ఆ కుటుంబాలు రేకుల షెడ్లలో బాడుగకు ఉంటున్నాయి. వీరు పూసలబలిజ సామాజిక వర్గానికి చెందిన వారు. ప్రస్తుతకూటమి ప్రభుత్వంలోనైనా తమకు ఇంటిపట్టాలు దక్కుతాయా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. 2014 నుంచి 2019 వరకు ఉన్న టీడీపీ హయాంలో ఇంటిపట్టాలు పంపిణీ చేసేందుకు పలు మార్లు ప్రయత్నాలు జరిగినా... స్థానిక నాయకుల సమన్వయలోపం వల్ల ఇవ్వలేకపోయారు. ఒక చోట ఒకరు ఇవ్వాలని... మరోక చోట ఇవ్వాలని మరో వర్గం పట్టుప ట్టడంతో అసలు వీరికి పట్టాలే అందకుండాపోయాయి. గత వైసీపీ ప్రభుత్వంలో తాడిమర్రి నుంచి మరువపల్లికి వెళ్లే దారిలోని ప్రభుత్వ స్థలంలో 190 మందికి ఇంటి పట్టాలిచ్చారు. అయితే శ్మశానానికి అనుకుని ఉండటం.. వర్షాలు వస్తే ఆ నీరంత ఇళ్లలోకి చేరుతుందని ఎవరూ అక్కడ ఇళ్లు నిర్మించుకోవడానికి సాహసం చేయలేదు. దానిని సాకుగా చూపి వైసీపీ ప్రభుత్వం ఇంటి పట్టాలను రద్దుచేసింది.

Updated Date - Jul 27 , 2024 | 12:15 AM