JNTU: ఆరోగ్యకరమైన అలవాట్లను పెంచుకోవాలి
ABN , Publish Date - Sep 13 , 2024 | 11:36 PM
ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లను పెంచుకోవాలని జేఎనటీయూ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ చెన్నారెడ్డి సూచించారు. శుక్రవారం కళాశాల ఎనఎ్సఎ్స యూనిట్-3 ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు.
అనంతపురం సెంట్రల్, సెప్టెంబరు 13: ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లను పెంచుకోవాలని జేఎనటీయూ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ చెన్నారెడ్డి సూచించారు. శుక్రవారం కళాశాల ఎనఎ్సఎ్స యూనిట్-3 ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ మమత అధ్యక్షతన నిర్వహించిన శిబిరాన్ని ప్రిన్సిపాల్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ పనిఒత్తిడి, ఆహారపు అలవాట్లు అనారోగ్యానికి గురిచేస్తాయన్నారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే భౌతికంగా, మానసికంగా ఆరోగ్యవంతులుగా ఉండవచ్చన్నారు. అనంతరం ఉద్యోగులు, సిబ్బంది, విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ప్రొఫెసర్ శశిధర్, జోజిరెడ్డి, డాక్టర్ నీరజ పాల్గొన్నారు.