Share News

ICDS : అంగనవాడీలతోనే చిన్నారుల అభివృద్ధి : సీడీపీఓ

ABN , Publish Date - Jun 29 , 2024 | 12:00 AM

చిన్నారులకు మానసీక, శారీరక దృఢత్వానికి అంగనవాడీ కేంద్రాలు కృషి చేస్తున్నాయని ఐసీడీఎస్‌ సీడీపీఓ రెడ్డి రమణమ్మ పేర్కొన్నారు. మండలపరిధిలోని కొడికొండ అగనవాడీ కేంద్రంలో ఐదేళ్లు పూర్తి చేసుకున్న చిన్నారులకు శుక్రవారం ఘనంగా గ్యాడ్యుయేషన కార్యక్రమం నిర్వహించారు.

ICDS : అంగనవాడీలతోనే చిన్నారుల అభివృద్ధి  : సీడీపీఓ
A view of the graduation day at Kodikonda Anganwadi Centre

చిలమత్తూరు, జూన 28: చిన్నారులకు మానసీక, శారీరక దృఢత్వానికి అంగనవాడీ కేంద్రాలు కృషి చేస్తున్నాయని ఐసీడీఎస్‌ సీడీపీఓ రెడ్డి రమణమ్మ పేర్కొన్నారు. మండలపరిధిలోని కొడికొండ అగనవాడీ కేంద్రంలో ఐదేళ్లు పూర్తి చేసుకున్న చిన్నారులకు శుక్రవారం ఘనంగా గ్యాడ్యుయేషన కార్యక్రమం నిర్వహించారు. వారిని ప్రాథమిక పాఠశాలలో చేర్పించారు. ఈ సం దర్భంగా సీడీపీఓ మాట్లాడుతూ... మూడు సంవత్సరాల చిన్నారులను సక్రమంగా అంగన వాడీ కేంద్రాలకు పంపేందుకు తల్లిదండ్రులు శ్రద్ధ చూపాలన్నారు. గ్రాడ్యుయేషన పిల్లలకు స్వీట్లు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో సూపర్‌వైజర్‌ రాధ, బీసీఓ వరుణ్‌కుమార్‌, కొడికొండ సెక్టార్‌ కార్యకర్తలు శోభారాణి తదితరలు ఉన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jun 29 , 2024 | 12:01 AM