GOD : పావగడలో పోటెత్తిన భక్తులు
ABN , Publish Date - Aug 24 , 2024 | 11:51 PM
పట్టణంలో ప్రసిద్ధిచెందిన శనీశ్వరుడి ఆలయా నికి శ్రావణమాస మూడో శనివారం సందర్భంగా భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామున 4.30కే జరిగిన తొలి పూజ, నవగ్రహ తైలాభిషేకానికి భ క్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మహిళలు శీతలాంబకు కుంకుమార్చ న చేయించారు. శనీశ్వరుడికి ఇష్టమైన నల్లనువ్వులు, నల్లగుడ్డలు అగ్ని గుండంలో వేసి, ప్రదక్షిణ చేసి శనిమహాత్మా మా జోలికి రావద్దని వేడుకు న్నారు.
పావగడ, ఆగస్టు 24 : పట్టణంలో ప్రసిద్ధిచెందిన శనీశ్వరుడి ఆలయా నికి శ్రావణమాస మూడో శనివారం సందర్భంగా భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామున 4.30కే జరిగిన తొలి పూజ, నవగ్రహ తైలాభిషేకానికి భ క్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మహిళలు శీతలాంబకు కుంకుమార్చ న చేయించారు. శనీశ్వరుడికి ఇష్టమైన నల్లనువ్వులు, నల్లగుడ్డలు అగ్ని గుండంలో వేసి, ప్రదక్షిణ చేసి శనిమహాత్మా మా జోలికి రావద్దని వేడుకు న్నారు. తమ వెన్ను శనీశ్వరుడికి చూపకుండా తిరిగి వెళ్లారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దాదాపు 50వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ కమిటీ డైరెక్టర్ కేవీ శ్రీనివాస్, ప్రధాన అర్చకులు సత్యనారాయణ శాస్ర్తి తెలిపారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....