DSP : ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తే వదిలిపెట్టం
ABN , Publish Date - Jun 16 , 2024 | 12:02 AM
ప్రభుత్వ ఆ స్తులను ఎవరైనా ధ్వ ంసం చేస్తే వారిని వదిలిపెట్టమని డీఎస్పీ జ నార్దననాయుడు హె చ్చరించారు. పట్టణ పో లీ్‌సస్టేషనలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
తాడిపత్రిటౌన, జూన 15: ప్రభుత్వ ఆ స్తులను ఎవరైనా ధ్వ ంసం చేస్తే వారిని వదిలిపెట్టమని డీఎస్పీ జ నార్దననాయుడు హె చ్చరించారు. పట్టణ పో లీ్‌సస్టేషనలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల అనంతరం పలుచోట్ల శిలాఫలకాలను ధ్వంసం చేసి ప్రభుత్వ ఆస్తులను నష్టపరుస్తున్నారన్నారు. ఇలాంటి వారిపై కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయన్నారు. రాజకీయపరంగా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం అంటే ప్రజల ఆస్తులను చేతులారా నాశనం చేయడమే అన్నారు. సమావేశంలో సీఐ నాగేంద్రప్రసాద్ పాల్గొన్నారు.
బక్రీద్‌ను ప్రశాంత వాతావరణంలో జరుపుకోండి
యాడికి: బక్రీద్ పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని తాడిపత్రి డీఎస్పీ జనార్దననాయుడు సూచించారు. శనివారం యాడికి పోలీ్‌సస్టేషనలో బక్రీద్ నిర్వహణపై ముస్లింలతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో సీఐ నాగార్జునరెడ్డి పాల్గొన్నారు.
గుతి: బక్రీద్ పండుగను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని సీఐ వెంకటరామిరెడ్డి, ఎస్‌ఐ నబీరసూల్ సూచించారు. స్ధానిక పోలీస్ స్టేషనలో శనివారం రాత్రి ముస్లిం మత పెద్దలతో సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ 17న ఈద్గా మైదనం వద్ద నిర్వహించే బక్రీద్ పండుగను ప్రశాంత వాతవరణంలో జరుపుకోవాలన్నారు. కార్యక్రమంలో గుత్తిఆర్‌ఎ్‌సలోని మత పెద్దలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.