GREVINCE: ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు
ABN , Publish Date - Nov 05 , 2024 | 12:09 AM
వివిధ సమస్యలపై ప్రజలు అందించే ఫిర్యాదుల పరిష్కారంలో ఏ అధికారి కూడా నిర్లక్ష్యం వహించరాదని జాయింట్ కలెక్టరు శివనారాయణశర్మ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని రెవెన్యూభవనలో సోమవారం ప్రజాఫిర్యాదుల వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు.
అనంతపురం టౌన, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): వివిధ సమస్యలపై ప్రజలు అందించే ఫిర్యాదుల పరిష్కారంలో ఏ అధికారి కూడా నిర్లక్ష్యం వహించరాదని జాయింట్ కలెక్టరు శివనారాయణశర్మ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని రెవెన్యూభవనలో సోమవారం ప్రజాఫిర్యాదుల వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తమ సమస్యల పరిష్కారం కోసం వందల మంది తరలివచ్చారు. జేసీతో పాటు అసిస్టెంట్ కలెక్టరు వినూత్న, డీఆర్‌ఓ మలోల, వివిధశాఖల ఉన్నతాధికా రులు ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 383 మంది అర్జీలు అందజేశారు. అనంతరం జేసీ అధికారులతో అర్జీల పరిష్కారంపై శాఖల వారిగా సమీక్షించారు. జేసీ మాట్లాడుతూ గ్రీవెన్సలో వచ్చిన అర్జీలను పరిశీలించి ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు.
పింఛన్ల పంపిణీలో ప్రగతిపై సత్కారం
జిల్లాలో సామాజిక పింఛన్ల పంపిణీలో ప్రగతి కనబరిచిన ఎంపీడీఓలను సత్కరించారు. డి.హీరేహాళ్, పామిడి, పుట్లూరు, కుందిర్పి, గుత్తి మండలాలకు చెందిన ఎంపీడీఓలు, సచివాలయ సిబ్బంది, ఆయా మండలాల పర్యవేక్షణ అధికారులను జేసీ సత్కరించి ప్రశంసాపత్రాలు అందజేశారు.
ఆస్పత్రులలో కనీస సౌకర్యాలు ఉండాలి
జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులలో మౌలిక వసతులు కల్పించాలని వైద్యాధికారులు, ఇంజినీరింగ్ అధికారులను జేసీ శివనారాయణశర్మ ఆదేశించారు. కలెక్టరేట్‌లో ఆస్పత్రులలో పరిస్థితిపై సోమవారం సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని అన్ని పీహెచసీలు, సీహెచసీలు, ఏరి యా ఆస్పత్రులలో కనీస మౌలిక వసతులు ఉండాలని అన్నారు. అంతర్గత రహదారులు, సివిల్ వర్కులు, తాగునీరు, కొళాయి కనెక్షన్లు, మరుగుదొడ్లు, సిటిజన చార్ట్, బయోమెడికల్ స్టోరేజీ పాయింట్, విద్యుత, సూచిక బోర్డు లు వంటివి తప్పనిసరిగా ఉండే లా చూడాలని ఆదేశించారు. జిల్లా సర్వజన ఆస్పత్రిలో కనీస వసతులు కల్పించాలని, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అన్నారు. డీఎంహెచఓ ఈబీ దేవి, డీసీహెచఎ్‌స డాక్టర్ రవికుమార్, వైద్యశాఖ క్వాలిటీ మేనేజరు స్టీఫెన, ఏపీఎంఎ్‌సఐడీసీ ఈఈ చంద్రశేఖరరెడ్డి పాల్గొన్నారు.