ప్రజల గొంతెండుతున్నా పట్టించుకోరా..?: సీపీఎం
ABN , Publish Date - Feb 13 , 2024 | 12:05 AM
నగరంలో పదిరోజులుగా తాగునీటి సమస్య వల్ల ప్రజల గొంతెండుతున్నా పాలకులు, అధికారులు పట్టించుకోరా..? అంటూ సీపీఎం నగర కార్యదర్శి రామిరెడ్డి మండిపడ్డారు
అనంతపురం కల్చరల్, ఫిబ్రవరి 12: నగరంలో పదిరోజులుగా తాగునీటి సమస్య వల్ల ప్రజల గొంతెండుతున్నా పాలకులు, అధికారులు పట్టించుకోరా..? అంటూ సీపీఎం నగర కార్యదర్శి రామిరెడ్డి మండిపడ్డారు. సోమవారం సీపీఎం నగర కమిటీ ఆధ్వర్యంలో నగరపాలకసంస్థ కార్యాలయం ముందు కుండలు పగులగొట్టి నిరసన వ్యక్తం చేశారు. రామిరెడ్డి మాట్లా డుతూ... నగరంలో నివసిస్తున్న ప్రజానీకానికి మంచినీటి సమస్య తీవ్రంగా ఉన్నా అధికారులు, పాలకుల్లో చలనం లేకపోవడం దౌర్భాగ్య కరమన్నారు. కూడేరు మండలం ముద్దలాపురం గ్రామం సమీపంలో కొరకోళ్ల డ్యామ్ వద్ద నీటి పంపింగ్ మోటార్లు చెడిపోయి ఆరు నెలలు గడుస్తున్నా వాటిని బాగు చేయించలేని అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, డీఈ చంద్రశేఖర్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దాహం వేసినపుడు బావి తవ్విన చందంగా అధికారుల తీరు ఉందని, ఇది మంచి పద్ధతి కాదని అన్నారు. గతంలో మున్సిపల్ కార్మికులు సమ్మె చేసినపుడు ప్రైవేట్ ట్రాక్టర్లు, జేసీబీలను పెట్టి చెత్త తొలగించిన పాలకులు, అధికారులు ఇపుడు మాత్రం మం చినీటి ట్యాంకర్లు ఎందుకు ఏర్పాటు చేయడం లేదని ప్రశ్నించారు. నగర జనాభాకు కేవలం ఐదు ట్యాంకర్లతో మంచినీటి సరఫరా చేస్తు న్నామని నగరపాలక అధికారులు చెబుతుం డడం సిగ్గుచేటని విమర్శించారు. కార్యక్రమంలో సీపీఎం నగర కార్యదర్శివర్గ సభ్యులు ముస్కిన, ప్రకాష్, వలి, జీవ, ఎన్టీఆర్ శీన, రాజు, నూరు ల్లా, ఫకృ, మోహన, ఇస్మాయిల్ పాల్గొన్నారు.