BLOOD DONATION: రక్తదానం చేయండి... ప్రాణదాతలు కండి
ABN , Publish Date - Jul 21 , 2024 | 11:57 PM
రక్తదానం చేయండి...ప్రాణదాతలు కండని యువత పిలుపునిచ్చింది. కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన మై గవర్నమెంట్, డిజిటల్ ఇండియా ప్రోగ్రాం పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రగతిపథం యూత అసోసియేషన, ఎస్‌ఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక రెడ్‌క్రాస్ సొసైటీలో రక్తదానశిబిరం నిర్వహించారు.
అనంతపురం క్లాక్‌టవర్, జూలై 21: రక్తదానం చేయండి...ప్రాణదాతలు కండని యువత పిలుపునిచ్చింది. కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన మై గవర్నమెంట్, డిజిటల్ ఇండియా ప్రోగ్రాం పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రగతిపథం యూత అసోసియేషన, ఎస్‌ఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక రెడ్‌క్రాస్ సొసైటీలో రక్తదానశిబిరం నిర్వహించారు. జిల్లా రిజిసా్ట్రర్ భార్గవ్ హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రక్తదానం చేయడం ద్వారా దాతల ఆరోగ్యం మరింత మెరుగుపడుతుందని, యువతలో మానవతా విలువలు పెరుగుతాయన్నారు. డిప్యూటీ తహసీల్దార్ గోపీనాథ్, కేంద్రప్రభుత్వ మై గవర్నమెంట్ అంబాసిడర్ బిసాటి భరత, రాష్ట్రపతి అవార్డు గ్రహీతలు జీవనకుమార్, జయమారుతి, అర్బనబ్యాంకు డైరెక్టర్ సుంకర రమేష్, ఎనఎ్‌సఎ్‌స ప్రోగ్రాం ఆఫీసర్ నాగశుభ, మురళీకృష్ణ, నందిత, పవన, కిరణ్‌సాయి, గణేష్, శివ పాల్గొన్నారు.