Share News

JOINT COLLECTOR : టమోటాను వృథాగా పడేయవద్దు

ABN , Publish Date - Aug 27 , 2024 | 12:11 AM

నోసేల్‌ కింద టమోటాను వృథాగా పడేయవద్దని జాయింట్‌ కలెక్టర్‌ శివ్‌నారాయణ్‌ శర్మ సూచించారు. సోమవారం కక్కలపల్లి టమోటా మార్కెట్‌ను ఆయన సందర్శించారు. రైతులు, వ్యాపారులతో మాట్లాడారు.

JOINT COLLECTOR : టమోటాను వృథాగా పడేయవద్దు
Joint collector checking tomato yield in the market

అనంతపురంరూరల్‌, ఆగస్టు 26: నోసేల్‌ కింద టమోటాను వృథాగా పడేయవద్దని జాయింట్‌ కలెక్టర్‌ శివ్‌నారాయణ్‌ శర్మ సూచించారు. సోమవారం కక్కలపల్లి టమోటా మార్కెట్‌ను ఆయన సందర్శించారు. రైతులు, వ్యాపారులతో మాట్లాడారు. మార్కెట్‌కు ఎంత టమోటా వస్తోంది? ఇక్కడి నుంచి ఎక్కడకు పంపిస్తున్నారు? ఒక్కో బాక్స్‌ ఎంత ధరకు పలుకుతోంది? ధరలు, కమీషన ఇతరాత్ర వివరాలను అడిగి తెలుసుకున్నారు. టమోటా నోసేల్‌ పడేందుకు కారణమేంటని ప్రశ్నించారు. వర్షాల వల్ల మచ్చలు రావడంతో పంట కొనుగోలు చేయలేదని వ్యాపారులు తెలిపారు. ఆయన మాట్లాడుతూ టమోటాను రోడ్ల పక్కన పడవేయరాదన్నారు. దగ్గర్లోని డంపింగ్‌ యార్డుకు తరలించాలన్నారు. వీలైతే పశువులకు, గొర్రెలకు ఆహారంగా అందించాలన్నారు. నాణ్యమైన పంటకు మంచి ధరలు అందించి రైతులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు కమీషనపై ప్రత్యేక దృష్టి సాధించాలని ఆదేశించారు. అనంతపురం అర్బన తహసీల్దార్‌ హరికుమార్‌, మార్కెట్‌ యార్డు కార్యదర్శి రాంప్రసాద్‌రావు పాల్గొన్నారు.

Updated Date - Aug 27 , 2024 | 12:11 AM