KESHAV : టీడీపీ హయాంలోనే కురుబలకు రాజకీయ ప్రాధాన్యం
ABN , Publish Date - May 07 , 2024 | 11:47 PM
టీడీపీ హయాంలోనే కురుబలకు రాజకీయ ప్రాధాన్యం కల్పించామని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పయ్యావుల కేశవ్ అన్నారు. పట్టణంలోని సత్యం కన్షెనల్ హాల్‌లో మంగళవారం కురుబల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి కేశవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకు మునువు కనకదాసు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఎమ్మెల్యే అభ్యర్థి పయ్యావుల కేశవ్
ఉరవకొండ, మే 7: టీడీపీ హయాంలోనే కురుబలకు రాజకీయ ప్రాధాన్యం కల్పించామని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పయ్యావుల కేశవ్ అన్నారు. పట్టణంలోని సత్యం కన్షెనల్ హాల్‌లో మంగళవారం కురుబల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి కేశవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకు మునువు కనకదాసు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కురుబసంఘం నాయకులు కంబళ్లు, కనకదాసు చిత్రపటాన్ని అందజేసి గజమాలతో కేశవ్‌ను సత్కరించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో కురుబలకు ఎంపీ, ఎమ్మెల్యే సీటు చంద్రబాబు కేటాయించారన్నారు. బీసీలకు రాజ్యాధికారం టీడీపీతోనే ప్రారంభమైందన్నారు. రాజకీయ ప్రాధాన్యత ఇస్తున్నా కురుబలు రాజ్యాధికారం వైపు అడుగులు వేయడం లేదన్నారు. రాజకీయంగా ముందుండి ప్రోత్సహిస్తామన్నారు. ఉరవకొండ కురుబల కల్యాణమండపాన్ని అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తి చేసే బాధ్యత నాదన్నారు. కురుబసంఘం రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ కురుబలు మాటిస్తే తప్పరన్నారు. బీజేపీ నియోజకవర్గ ఇనచార్జి కొనకొండ్ల రాజేష్, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు తట్రగల్లు సుధాకర్, చాబాల ఈశ్వర్, జియో శ్రీన, రమేష్, ఈశ్వరయ్య, గోపాల్, చేజాల ప్రభాకర్, తిమ్మప్ప, నరేంద్ర, శరత, అనిల్ పాల్గొన్నారు.
టీడీపీ వెంటే మైనార్టీలు: టీడీపీ వెంటనే మైనార్టీలు ఉంటారని ఆపార్టీ నాయకులు అల్లాబకాష్, రహంతుల్లా అన్నారు. పట్టణంలో పయ్యావుల కేశవ్‌కు మద్ధతుగా మంగళవారం ప్రచారం చేశారు. ఖాదర్, సలాం, రఫీ, కిట్టు, యూనిస్ పాల్గొన్నారు.
టీడీపీలోకి చేరిక: వజ్రకరూరు మండలంలోని వెంకటాంపల్లి పెద్ద తండాకు చెందిన వైసీపీ నాయకులు టీడీపీలోకి చేరారు. కౌకుంట్ల గ్రామంలో పయ్యావుల శ్రీనివాసులు సమక్షంలో సోమ్లానాయక్, కొర్రా ఆనంద్‌నాయక్, డాక్యనాయక్, ఎర్రిస్వామి నాయక్‌కు ఆయన పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు.
బెళుగుప్ప: మండలంలోని కోనంపల్లికి చెందిన వైసీపీ నాయకులు మంగళవారం పయ్యావుల శ్రీనివాసులు సమక్షంలో టీడీపీలోకి చేరారు. ఆమిద్యాల, యర్రిస్వామి వన్నూరు స్వామి, ఎమ్మార్పీఎస్ నాయకులు పురుషోత్తమ్, సురేష్, సుధాకర్‌లు చేరగా పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. స్థానిక నాయకులు వెంకటేశులు, యర్రిస్వామి, మారెన్న, దాస్, యుగంధర్ పాల్గొన్నారు.