Share News

TADIPATRI PS : ఖాళీస్‌ స్టేషన..!

ABN , Publish Date - Jul 18 , 2024 | 11:35 PM

రాష్ట్రంలోని సమస్యాత్మక ప్రాంతాల్లో మొదటి వరుసలో ఉండే తాడిపత్రికి పోలీసు సిబ్బంది కొరత వేధిస్తోంది. ఈ ప్రాంతంలో చిన్న సమస్య తలెత్తినా చినికి చినికి గాలివానగా మారుతుంది. ఎన్నికల సమయంలో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారుతుంది. రెండు నెలల క్రితం జరిగిన దాడులు, ప్రతిదాడులు ఈ ప్రాంతంలో శాంతిభద్రతల సమస్య ఏ స్థాయిలో ఉందో ..

TADIPATRI PS : ఖాళీస్‌ స్టేషన..!
Tadipatri Town Police Station

తాడిపత్రిలో సీఐ ఒక్కరే..!

నెల రోజులుగా ఎస్‌ఐ పోస్టు ఖాళీ

ఏడాదిలో మారిన సీఐలు ఆరుగురు

30 వేల జనాభాకు 30 మంది పోలీసులూ లేరు

ఉన్నవారికి పనిభారం

రెచ్చిపోతున్న దొంగలు..

తాడిపత్రి, జూలై 18: రాష్ట్రంలోని సమస్యాత్మక ప్రాంతాల్లో మొదటి వరుసలో ఉండే తాడిపత్రికి పోలీసు సిబ్బంది కొరత వేధిస్తోంది. ఈ ప్రాంతంలో చిన్న సమస్య తలెత్తినా చినికి చినికి గాలివానగా మారుతుంది. ఎన్నికల సమయంలో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారుతుంది. రెండు నెలల క్రితం జరిగిన దాడులు, ప్రతిదాడులు ఈ ప్రాంతంలో శాంతిభద్రతల సమస్య ఏ స్థాయిలో ఉందో చెప్పకనే చెబుతాయి. కానీ సిబ్బంది కొరత కారణంగా సమస్యను సకాలంలో పరిష్కరించలేకున్నారు. పట్టణ పోలీస్‌ స్టేషనలో తగినంత సిబ్బంది లేరు. దీంతో నేరాలను అరికట్టడం, ప్రజల సమస్యలను పరిష్కరించడంలో పోలీసు అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చివరికి ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకోవడానికి కూడా తగిన సిబ్బంది లేకపోవడం గమనార్హం. నాయకుల


రాజకీయ విభేదాలు, ఒత్తిళ్ల కారణంగా ఇక్కడికి వచ్చేందుకు పోలీసు అధికారులు సైతం జంకుతారు. ధైర్యంచేసి వచ్చిన అధికారులు రెండు నెలలకు మించి నిలవలేకపోతున్నారు. ఏడాది వ్యవధిలో ఆరుగురు సీఐలు మారడం దీనికి నిదర్శనం. తరచూ పోలీసు అధికారులు మారుతుండటంతో నేరాల అదుపు సాధ్యం కావడం లేదన్న విమర్శలు ఉన్నాయి. అధికారులు స్థిరంగా ఉంటే ఈ ప్రాంత సమస్యలపై అవగాహన పెరుగుతుంది, తద్వారా నేర నియంత్రణ సాధ్యమౌతుంది.

నిలవలేకున్న సీఐలు

తాడిపత్రి పట్టణ పోలీ్‌సస్టేషనలో ఏడాది వ్యవధిలో ఆరుగు సీఐలు మారారు. దీనికి ఒత్తిళ్లే కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏడాది క్రితం వచ్చిన సీఐ ఆనందరావు దాదాపు 10 నెలలు విధులపాటు విధులు నిర్వహించారు. ఆయన ఆత్మహత్య చేసుకోవడంతో.. ఆ స్థానంలో హమీద్‌ఖాన బాధ్యతలు స్వీకరించారు. వివిధ రకాల ఆరోపణలు రావడంతో ఐదునెలలకే ఉన్నతాధికారులు ఆయనను వీఆర్‌కు పంపారు. ఈ స్థానంలో పనిచేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ట్రైనీ డీఎస్పీగా ఉన్న హేమంతకుమార్‌ రెండు నెలలపాటు సీఐ విధులు కూడా నిర్వహించాల్సి వచ్చింది. ఆ తరువాత సీఐగా వచ్చిన మురళీకృష్ణ.. ఎన్నికల గొడవల కారణంగా సస్పెండ్‌ అయ్యారు. ఆ వెంటనే నాగేంద్రప్రసాద్‌ సీఐగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన కూడా ఒత్తిళ్లు భరించలేక దీర్ఘకాలిక సెలవులో వెళ్లారు. ఆయన స్థానంలో బాధ్యతలు తీసుకున్న ఇస్మాయిల్‌.. కేవలం పదిరోజులు ఉన్నారు. ఆయన స్థానంలో నాగేంద్రప్రసాద్‌కు బాధ్యతలు అప్పగించారు.

ఎస్‌ఐ పోస్టు ఖాళీ

పట్టణ పోలీ్‌సస్టేషనలో ఎస్‌ఐ పోస్టు నెలరోజుల నుంచి ఖాళీగా ఉంది. ఈ స్థానాన్ని భర్తీ చేయాల్సిన అధికారులు.. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. సమస్యలపై ఫిర్యాదు చేయడానికి వచ్చే ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎస్‌ఐ స్థాయి అధికారి లేకపోవడంతో కిందిస్థాయి సిబ్బంది కొన్ని ఫిర్యాదులు తీసుకోవడంలేదు. దీంతో బాధితులు అసంతృప్తితో వెనుదిరిగి వెళుతున్నారు. నిబంధనల మేరకు తాడిపత్రి పట్టణ జనాభాకు అనుగుణంగా పోలీస్‌ స్టేషనకు ఒక సీఐ, ఇద్దరు ఎస్‌ఐలు, నలుగురు ఏఎ్‌సఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు 10 మంది, కానిస్టేబుళ్లు 42 మంది ఉండాలి. కానీ 30 వేల జనాభా ఉన్న తాడిపత్రికి ఈ మాత్రం సిబ్బంది, అధికారులు కూడా లేరు.

సీఐకి పనిభారం

రాజకీయ ఒత్తిళ్లు, నేరాలను అరికట్టడం, ప్రజల సమస్యలను పరిష్కరించడం వంటి పనులు పట్టణ సీఐ నాగేంద్రప్రసాద్‌కు భారంగా మారాయి. సిబ్బంది కొరత కారణంగా నేరాలను అరికట్టలేకపోతున్నారన్న విమర్శలు ఉన్నాయి. నెలరోజుల వ్యవధిలో వరుసగా ఐదు దొంగతనాలు జరగడం సమస్యను ఎత్తిచూపుతోంది. బాధితులు పోలీ్‌సస్టేషన చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. కానీ దొంగల ఆచూకీ లభ్యం కాలేదు. పట్టణం నలువైపులా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలలో కొన్ని పనిచేయడం లేదు. రాత్రి వేళల్లో బీట్‌ విధులకు సిబ్బంది వెళ్లడం లేదు. దీంతో దొంగలు మరింత రెచ్చిపోతున్నారు.

సిబ్బందిని నియమించరా..?

తాడిపత్రి పట్టణంలో గత ఏడాది సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో ఏకంగా ముగ్గురు ఎస్‌ఐలు విధులు నిర్వహించారు. అప్పట్లో దొంగతనాలుగాని, రాజకీయ దాడులుగాని జరగలేదు. ఆ సమయంలో సీఐ, ఎస్‌ఐలతోపాటు ట్రాఫిక్‌ ఎస్‌ఐ కూడా ఉండేవారు. ప్రస్తుతం సీఐ, ఇద్దరు ఏఎ్‌సఐలు, ఆరుగురు హెడ్‌కానిస్టేబుళ్లు, 17 మంది కానిస్టేబుళ్లు ఉన్నారు. సమస్యలు రాజ్యమేలుతున్న సమయంలో ఎస్‌ఐ కూడా లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఎస్‌ఐ మహమ్మద్‌గౌ్‌సను నెల క్రితం పెద్దపప్పూరు స్టేషనకు ఇనచార్జిగా వేశారు. దీంతో ఆయన అక్కడికి వెళ్లారు. సిబ్బంది కొరత వేధిస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికైనా స్పందించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jul 18 , 2024 | 11:35 PM