Home » Tadipatri
JC Prabhakar Reddy: తాడిపత్రిలో పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి. ఈ ఇద్దరు నేతల మధ్య ఎప్పుడు ఏదో ఒక వివాదం చోటుచేసుకునే ఉంటుంది. వైసీపీ హయాంలో తనను అన్యాయంగా జైలుకు పంపించారని జైసీ ప్రభాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు.
ఏపీ అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య ఘర్ణణ జరగడంతో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ నేత ఫయాజ్ బాషా ఇంటి వద్ద ఒకరిపై ఒకరు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు.
పరిశ్రమలు బాగుపడాలంటే విద్యుత చార్జీలు తగ్గించి, రాయితీలు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీలో సోమవారం ఆయన మాట్లాడుతూ 25 ఏళ్ల కిందట తాడిపత్రి నియోజకవర్గంలో సాగు, తాగునీరు ఇబ్బందిలేకుండా మంచి పంటలు పండేవన్నారు.
ఎ.కొండాపురం శివారులోని కొండప్రాంతంలో మట్టి తవ్వకాలను సర్పంచు వనజమ్మ ఆధ్వర్యంలో చంద్రదండు నాయకులు గురువారం అడ్డుకున్నారు. ఎక్స్‌కవేటర్లు, టిప్పర్లను నిలిపివేశారు. మట్టి అక్రమ తవ్వకాలతో ఎ.కొండాపురం, అరకటవేముల, సూరేపల్లి గ్రామాల పరిధిలో కొండలు కనుమరుగు అవుతున్నాయని చంద్రదండు రాష్ట్ర అధ్యక్షుడు ప్రకా్‌షనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని అన్నారు. తవ్వకాలు కొనసాగితే కొండ.....
సైబర్ నేరాలపై ప్రజలు చైతన్యవంతులు కావాలని ఎస్‌ఐ జనార్ధననాయుడు అన్నారు. పట్టణంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపైన ఆటోల ద్వారా అవగాహన కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు.
మండలంలోని అశ్వత్థ నారాయణస్వామి చక్రస్థాపన భీమలింగేశ్వరస్వామి మాఘమాసం సందర్భంగా మూడో ఆదివారం జరగనున్న తిరునాళ్ల ఏర్పాట్లను మున్సిపల్ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి పరిశీలించారు.
తాడిపత్రి మండలం నందలపాడు గ్రామంలో ఆంజనేయస్వామి మాన్యం భూమిలో నివాసముంటున్న కుటుంబాలకు న్యాయం చేయాలని బాధిత కుటుంబాలు డిమాండ్ చేశాయి. వారు బుధవారం జిల్లా కేంద్రంలోని దేవదాయశాఖ సహాయ కమిషనర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.
Kethireddy peddareddy: ‘‘తాడిపత్రిలో నా ఇంటికి పోలీసులు నన్ను వెళ్ళనివ్వడం లేదు. వేరే దేశానికి వెళ్లాలంటే వీసా కావాలి. తాడిపత్రి కి వెళ్ళాలంటే వీసా ఏమైనా తీసుకోవాలా. పోలీసులు వీసా ఆఫీస్ చెప్పితే అక్కడికి వెళ్లి అప్లై చేసుకుంటా’’ అంటూ కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎద్దేవా చేశారు.
పట్టణంలోని గానుగవీధి, రాగితోటపాలెంలోని కొన్ని వార్డుల్లో ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి పర్యటించారు. వార్డుల్లో తిరుగుతూ అందరిని ఆప్యాయంగా పలకరిస్తూ సమస్యలపై ఆరాతీశారు.
తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తనను వేరే వాళ్ళతో ఫోన్ చేయించి బెదిరిస్తున్నారని, జేసీ ఫోన్ నెంబర్ కావాలని రాం పుల్లయ్య అనే వ్యక్తి సీఐ సాయిప్రసాద్‌ను అడిగారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సీఐ తానేమి మీ సర్వెంట్‌ను కాదని, జేసీ ప్రభాకర్ రెడ్డి ఫోన్ నెంబర్ తానేందుకు ఇవ్వాలంటూ రాం పుల్లయ్యను గద్దించారు. ఈ క్రమంలో...