GUMMANURU: టీడీపీలోనే అన్ని కులాలకు సమన్యాయం: జయరాం
ABN , Publish Date - May 07 , 2024 | 11:45 PM
టీడీపీలో మాత్రమే అన్ని కులాలకు సమన్యాయం లభిస్తుందని ఆ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి గుమ్మనూరు జయరాం అన్నారు. మంగళవారం ఉదయం పాతగుంతకల్లులోని కనకవీటి వీధిలో పెద్ద సంఖ్యలో కురుబలు టీడీపీలోకి చేరారు. దాదాపు 70 కుటుంబాలు జయరాం సమక్షంలో పార్టీ కండువాలు ధరించి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.
గుంతకల్లు, మే 7: టీడీపీలో మాత్రమే అన్ని కులాలకు సమన్యాయం లభిస్తుందని ఆ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి గుమ్మనూరు జయరాం అన్నారు. మంగళవారం ఉదయం పాతగుంతకల్లులోని కనకవీటి వీధిలో పెద్ద సంఖ్యలో కురుబలు టీడీపీలోకి చేరారు. దాదాపు 70 కుటుంబాలు జయరాం సమక్షంలో పార్టీ కండువాలు ధరించి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. జయరాం మాట్లాడుతూ తాను ఆలూరు నియోజకవర్గంలో జనసంఖ్యను బట్టి వివిధ కులాలకు తగిన ప్రాధాన్యం, పదవులను ఇచ్చానన్నారు. ఇక్కడ కురబలు పెద్ద సంఖ్యలో ఉన్నారని, వారిని తప్పక దృష్టిలో ఉంచుకుంటానన్నారు. వైసీపీలో అన్యాయం జరిగిందని టీడీపీలోకి వచ్చారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీలోనూ, రాజకీయంగానూ తగిన గుర్తింపు నిస్తానని హామీ ఇచ్చారు. కురుబ సంఘం ఉపాధ్యక్షుడు రామప్ప, మదనమోహన, రామలక్ష్మన్న, వీరుపాక్షి, వీరన్న, మల్లేశ, రామాంజి, శేఖర్ చేరిన వారిలో ఉన్నారు. కార్యక్రమంలో బండారు ఆనంద్, గుమ్మనూరు నారాయణ స్వామి, కేసీ హరి, డన్లప్ బాషా, పాండుకుమార్ పాల్గొన్నారు. అనంతరం వైసీపీ నాయకుడు ఫ్లయింగ్ అబ్దుల్లాను జయరాం పార్టీ కండువా వేసి ఆహ్వానించారు.
గుత్తి: పట్టణంలో ప్రజలు తాగునీటి కోసం పడుతున్న కష్టాలను తాను గుర్తించానని నీటి సమస్య లేకుండా పరిష్కారానికి కృషి చేస్తానని గుమ్మనూరు జయరాం అన్నారు. గుత్తి ఆర్‌ఎ్‌సలో మంగళవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గుంతకల్లు నియోజకవర్గంలోని మూడు మండలాలలో వార్ వన సైడ్ అయ్యిందన్నారు. వైసీపీ ఎమ్మెల్యే వెంకటరామి రెడ్డికి భయం పట్టుకుందన్నారు. టీడీపీ నాయకులు గుమ్మనూరు నారాయణ, అబ్దుల్ వహబ్, న్యాయవాది సోమశేఖర్, రమేష్, శ్రీకాంత, కొనకొండ్ల సూరి పాల్గొన్నారు. అనంతరం ఆర్‌ఎ్‌సలో వా సవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆర్యవైశ్య నాయకులతో ఆత్మీయ సమ్మెళనం నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు మల్లికార్జున గుప్త, నాయకులు సంపత కుమార్, మధుసూదన గుప్త తదితరులు పాల్గొన్నారు.
గుత్తిరూరల్: రాష్ట్ర ప్రజల భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని గుమ్మనూరు జయరాం, జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్ అన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. మాముడూరు గ్రామంలో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన 30 కుటుంబాలకు కండువావేసి పార్టీలోకి ఆహ్వనించారు. బర్దివలి, చిన్నరెడ్డి యాదవ్, గుమ్మనూరు నారాయణ, సర్పంచు భరత, జింకల నారాయణస్వామి పాల్గొన్నారు.
పామిడి: తెలుగుదేశం పార్టీ పాలనలోనే మహిళలకు రక్షణ అని గుమ్మనూరు జయరాం తనయుడు గుమ్మనూరు ఈశ్వర్ అన్నారు. మండలంలోని ఎదురూరు, వంకరాజుకాలువ, కండ్లపల్లి గ్రామాల్లో మంగళవారం విస్తృత ప్రచారం చేపట్టారు. విజయభాస్కర్‌నాయుడు, సునీల్, సుంకప్ప, మల్లికార్జునరెడ్డి, శ్రీనివాసులు పాల్గొన్నారు.