Share News

BUS : ప్రమాదమని తెలిసినా... మారని తీరు

ABN , Publish Date - Jun 22 , 2024 | 11:50 PM

ప్రమాదాల నివారణ కు....ప్రయాణికుల రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను అటు బస్సు డ్రైవర్లు...ఇటు ప్రయాణికులు సైతం పెడ చెవిన పెడుతున్నారు. నడి రోడ్డుపై బస్సు ఆపడం...నడి రోడ్డులో నిలబడిన బస్సును ఎక్కడం ప్రమాదమని తెలిసినా వారు అదే పనిచేస్తూ ప్రమాదాలను కొని తె చ్చుకుంటున్నారు. మండలంలోని కొడికొండ చెక్‌పోస్టు లో బస్టాండ్‌ లేదు.

BUS : ప్రమాదమని తెలిసినా... మారని తీరు
The bus stops on the road and passengers are picked up

చిలమత్తూరు, జూన 22: ప్రమాదాల నివారణ కు....ప్రయాణికుల రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను అటు బస్సు డ్రైవర్లు...ఇటు ప్రయాణికులు సైతం పెడ చెవిన పెడుతున్నారు. నడి రోడ్డుపై బస్సు ఆపడం...నడి రోడ్డులో నిలబడిన బస్సును ఎక్కడం ప్రమాదమని తెలిసినా వారు అదే పనిచేస్తూ ప్రమాదాలను కొని తె చ్చుకుంటున్నారు. మండలంలోని కొడికొండ చెక్‌పోస్టు లో బస్టాండ్‌ లేదు. దీంతో ఇటు బెంగళూరు, అటు అ నంతపురం, కదిరి, పుట్టపర్తి వైపు వెళ్లే బస్సులు అక్క డున్న ప్రధాన కూడలిలోనే నడిరోడ్డుపై బస్సులను ఆపు తూ ప్రయాణికులను ఎక్కించుకొని వెళుతున్నారు.


ఇలా చేయడం వలన వేగంగా వచ్చే వాహనాల వల్ల ప్రయాణికులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉం ది. ఇలా ప్రమాదాలు జరిగిన సంఘటనలు కంటికి కనపడుతున్నా, వాటిని నియంత్రించేందుకు చర్యలు చేపట్టాల్సిన పోలీసులు చూసీ చూడనట్లు వ్యవహరి స్తున్నారు. గతంలో పోలీసులు ఈ ప్రాంతాన్ని బ్లాక్‌ స్పాట్‌గా గుర్తించి ప్రమాదాల నివారణకు చర్యలు తీసు కున్నారు. అందులో భాగంగా బస్సులను నడి రోడ్డుపై కాకుండా సర్వీస్‌ రోడ్డుపై ఆపి ప్రయాణికులను ఎ క్కించుకొనేనా ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ప్రయాణి కులు బస్సుల కోసం 44వ జాతీయ రహదారిపై అటూ ఇటూ పరుగులు తీయకుండా సురక్షితంగా బస్సు ఎక్కే ఏర్పాట్లు చేశారు. ఇందుకోసి అక్కడ కానిస్టేబుల్‌ను వి ధుల్లో ఉంచారు. కానీ ఇది కొన్ని రోజులు మాత్రమే సా గింది. ఆ తరువాత పోలీసుల సూచనలు గాలికి వదిలే సి డ్రైవర్లు కూడలిలో నడిరోడ్డుపైనే బస్సులను ఆపుతూ ప్రమాదాలకు స్వాగతం పలుకుతున్నారని పలువురు విమర్శిస్తున్నారు. దీనిపై పోలీసులు మరోసారి దృష్టి పె ట్టి సర్వీస్‌ రోడ్డుపైనే బస్సులు ఆగేవిధంగా చర్యలు తీసుకోవాలని, ప్రయాణికులు సురక్షితంగా గమ్య స్థా నాలకు చేరేలా చూడాలని కోరుతున్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jun 22 , 2024 | 11:50 PM