Share News

GRIEVENCE: ప్రతి ఫిర్యాదుకు పరిష్కారం చూపాలి

ABN , Publish Date - Oct 14 , 2024 | 11:57 PM

ప్రజా ఫిర్యాదుల వేదికకు వచ్చే ప్రతి బాధితుడి సమస్యను పరిశీలించి పరిష్కారం చూపాలని అధికారులకు కలెక్టరు డాక్టర్‌ వినోద్‌కుమార్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని రెవెన్యూభవనలో సోమవారం గ్రీవెన్స నిర్వహించారు.

GRIEVENCE: ప్రతి ఫిర్యాదుకు పరిష్కారం చూపాలి
Collector Vinod Kumar is receiving complaints from the victims

అధికారుల సమీక్షలో కలెక్టరు వినోద్‌ కుమార్‌

అనంతపురం టౌన, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): ప్రజా ఫిర్యాదుల వేదికకు వచ్చే ప్రతి బాధితుడి సమస్యను పరిశీలించి పరిష్కారం చూపాలని అధికారులకు కలెక్టరు డాక్టర్‌ వినోద్‌కుమార్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని రెవెన్యూభవనలో సోమవారం గ్రీవెన్స నిర్వహించారు. పలువురు బాధితులు తమ సమస్యలపై అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. కలెక్టరుతో పాటు డీఆర్‌ఓ రామక్రిష్ణారెడ్డి, డిప్యూటీ కలెక్టరు ఆనంద్‌ తదితరులు 253మంది బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం అధికారులతో కలెక్టరు సమీక్ష నిర్వహించారు. ఫిర్యాదులు పెండింగ్‌ ఉండకుండా సకాలంలో పరిష్కరించాలని ఈ సందర్భంగా కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు.

జనరేటర్‌ బ్యాకప్‌ ఉండాలి..

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లాలో భారీవర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ ఆదేశించారు. జిల్లాలోని ప్రతి కార్యాలయంలోను జనరేటర్‌ బ్యాకప్‌ ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. తహసీల్దార్‌, ఎంపీడీఓ, ఆర్డీఓ కార్యాలయాలలోను, కలెక్టరేట్‌లోను బ్యాకప్‌ జనరేటర్‌ ఉండాలన్నారు. వీటి పర్యవేక్షణ కోసం ఓ ప్రత్యేక ఇనచార్జ్‌ను నియమించాలని ఆదేశించారు.


రేపు, ఎల్లుండి విద్యా సంస్థలకు సెలవు

ఈనెల 16, 17 తేదీలలో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. వాతావరణం బాగుంటే సెలవులను రద్దు చేస్తామన్నారు. కలెక్టరేట్‌లోను, అన్నిమండల కేంద్రాలలోను ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. ఈనెల16, 17 తేదీలలో పల్లెపండుగ కార్యక్రమాల విషయంలో స్థానిక ప్రజాప్రతినిధులతో మాట్లాడుకొని వాయిదా వేసుకోవాలని సూచించారు. జిల్లాలో ప్రమాదకరం గా ఉన్న బ్రిడ్జిలు, భవనాలను గుర్తించాలని అక్కడకు ఎవరిని వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. లోతట్టుప్రాంతాలను గుర్తించి ఎక్కడా జనం ఇబ్బందులు పడకుండా, ఆస్తినష్టం జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఇరిగేషన ట్యాంకులను తహసీల్దార్‌, మైనర్‌ఇరిగేషనశాఖ అధికారులు తనిఖీ చేయాలన్నారు. ఆట్యాంకుల వద్ద వీఆర్‌ఓ, వీఆర్‌ఏలను పర్యవేక్షణకు నియమించాలని ఆదేశించారు. వర్షాల గురించి ముందుగానే గ్రామాలలో దండోరా వేయించి ప్రజలను అప్రమత్తంచేయాలని సూచించారు. సమా వేశంలో జడ్పీ సీఈఓ వెంకటసుబ్బయ్య, వ్యవసాయశాఖ జేడీ ఉమా మహేశ్వరమ్మ, సీపీఓ అశోక్‌కుమార్‌, ఎల్‌డీఎం నర్సింగరావు, డీఎంహెచఓ డాక్టర్‌ ఈ.బీ.దేవి, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వెంకటేశ్వరరావు, వివిధశాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Oct 14 , 2024 | 11:57 PM