KESHAV CAMPAIN: ప్రతి చెరువుకు నీరిస్తా
ABN , Publish Date - Apr 30 , 2024 | 11:58 PM
కూటమి అధికారంలోకి వస్తే మండలంలోని ప్రతిచెరువుకు నీరిచ్చి రైతన్నను ఆదుకుంటానని ఎమ్మెల్యే ప య్యావుల కేశవ్ హామీ ఇచ్చారు. మంగళవారం మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్ర చారంలో భాగంగా రోడ్‌షో నిర్వహించారు. గ్రామగ్రామాన విశేష స్పందన లభించింది. గ్రామాల్లో సమస్యలు తెలుసుకుని అధికారంలోకి రాగానే పరిష్కరించేందుకు కృషి చేస్తానని కేశవ్ అన్నారు.
రోడ్‌షోలో ఎమ్మెల్యే పయ్యావుల హామీ
బెళుగుప్ప, ఏప్రిల్ 30: కూటమి అధికారంలోకి వస్తే మండలంలోని ప్రతిచెరువుకు నీరిచ్చి రైతన్నను ఆదుకుంటానని ఎమ్మెల్యే ప య్యావుల కేశవ్ హామీ ఇచ్చారు. మంగళవారం మండలంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్ర చారంలో భాగంగా రోడ్‌షో నిర్వహించారు. గ్రామగ్రామాన విశేష స్పందన లభించింది. గ్రామాల్లో సమస్యలు తెలుసుకుని అధికారంలోకి రాగానే పరిష్కరించేందుకు కృషి చేస్తానని కేశవ్ అన్నారు. టీడీపీ హయాంలో చేపట్టిన అభివృద్ధి మినహా వైసీపీ ఈ అయిదేళ్లలో ఏమి చేశారని ప్రశ్నించారు. విశ్వేశ్వరరెడ్డి ఒక్క అభివృద్ధి అయినా చేశారా అని ప్రశ్నించారు. ఆయనకు ఓటేస్తే వృథాయేనని విమర్శించారు.
ఉన్న చెరువులను నింపలేని అసమర్థ నాయకుడు అన్నారు. భూకబ్జాదారులకు ఓటేయవద్దన్నారు. అభివృద్ధి ఏమిటో తాను చేసి నిరూపిస్తానన్నారు. దళిత, గిరిజనులను ఆదుకుంటామన్నారు. రోడ్లన్నీ అధ్వానంగా ఉన్నాయన్నారు. శ్మశాన వాటిక, సీసీ రోడ్లు వేయిస్తానన్నారు. చెరువులకు నీరిస్తేనే గట్టెక్కేదని రైతులకు విన్నవించారు. సైకిల్ గుర్తుకు ఓటు వేసి కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. రాధాకృష్ణ, ఆనంద్, పెద్ద తిప్పయ్య, మల్లికార్జున, తగ్గుపర్తి రాధాకృష్ణ, తిమ్మప్ప, సురేష్ రాము, శివప్ప, ఓబుళేసు, దేవప్ప, రమేష్, శ్రీనివాసులు, భాష, అంజి, మారెప్ప, ధనుంజయ పాల్గొన్నారు.
పయ్యావుల కేశవ్‌కు గజమాలతో ఘన స్వాగతం
నరసాపురంలో ఎమ్మెల్యేకు స్థానిక నాయకులు వెంకటేశులు, అరవింద్, మురళి, ప్రసాద్, నరిగన్న, చిన్న బాలప్ప, హనుమంతరెడ్డి, వెంకటేశులు, నాగరాజు, నారాయణ స్వామి బత్తాయిల గజమాలతో ఘన స్వాగతం పలికారు.
చంద్రబాబుతోనే రాష్ర్టాభివృద్ధి
ఉరవకొండ: చంద్రబాబుతోనే రాష్ర్టాభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే తనయుడు విజయ్‌సింహా అన్నారు. వజ్రకరూరు మండలంలోని గంజికుంట, క మలపాడు, కమలపాడుతండా, ప్యాపిలి గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి సూపర్‌సిక్స్ పథకాల కరపత్రాలను పంపిణీ చే శారు. సైకిల్ గుర్తుకు ఓటు వేసి కూటమి అభ్యర్థి పయ్యావుల కేశవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. నాగేంద్ర, సుధాకర్, ధనుంజయ, నాగన్న, పెద్దన్న, రామచంద్ర నాయక్, లాలునాయక్ పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..