FREE SAND : ఇంగ అంతా ఫ్రీ
ABN , Publish Date - Jul 08 , 2024 | 11:13 PM
ఉచిత ఇసుక విధానాన్ని కూటమి ప్రభుత్వం సోమవారం నుంచి అమలులోకి తీసుకువచ్చింది. ఈ మేరకు భూగర్భగనుల శాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి యువరాజ్ జీఓ నంబరు 70 జారీ చేశారు. 2019, 2021లో అప్పటి ప్రభుత్వం ఇచ్చిన ఇసుకపాలసీని రద్దు చేస్తూ నూతన పాలసీ విడుదల చేశారు. ఉచిత ఇసుకకు సంబంధించిన పోస్టర్లను భూగర్భగనుల శాఖ ఏజీ రామకృష్ణప్రసాద్‌తో కలిసి కలెక్టర్ కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. ...
ఉచిత ఇసుక ఉత్తర్వులు
జారీ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు
అనంతపురం క్లాక్‌టవర్/అర్బన, జూలై 8: ఉచిత ఇసుక విధానాన్ని కూటమి ప్రభుత్వం సోమవారం నుంచి అమలులోకి తీసుకువచ్చింది. ఈ మేరకు భూగర్భగనుల శాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి యువరాజ్ జీఓ నంబరు 70 జారీ చేశారు. 2019, 2021లో అప్పటి ప్రభుత్వం ఇచ్చిన ఇసుకపాలసీని రద్దు చేస్తూ నూతన పాలసీ విడుదల చేశారు. ఉచిత ఇసుకకు సంబంధించిన పోస్టర్లను భూగర్భగనుల శాఖ ఏజీ రామకృష్ణప్రసాద్‌తో కలిసి కలెక్టర్ కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు.
టన్ను ఇసుక రూ.195
ప్రస్తుతం ఇసుక ధర టన్ను రూ.195గా నిర్ణయించారు. తవ్వకం, రవాణా, సీనరీజ్‌తో కలిపి టన్ను ఇసుకకు రూ.195 చెల్లించాలి. స్టాక్‌పాయింట్ వద్దనే మొత్తాన్ని చెల్లించాలి. వినియోగదారుడు ఆధార్ కార్డు, మొుబైల్ నంబరు, ఎక్కడికి, ఎందుకు ఇసుక తరలిస్తున్నారనే అంశం, వాహన నంబరు పొందుపరచాలి. ఒక వ్యక్తికి రోజుకు 20 టన్నులు మాత్రమే ఇస్తారు. రెండు వారాలపాటు స్టాక్‌పాయింట్ వద్ద ఆఫ్‌లైనలోనే మ్యానువల్‌గా రసీదులు పొందవచ్చు. జాయింట్ అకౌంట్‌కు డిజిటల్ పేమెంట్స్ మాత్రమే అనుమతిస్తున్నారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6గంటల వరకు మాత్రమే ఇసుక రవాణాకు అనుమతి ఉంటుంది.
ఇసుక రీసేల్ నిషేధం
సొంత అవసరాల కంటే ఎక్కువ ఇసుకను నిల్వచేయడం, రీసేల్, ఇతర రాష్ట్రాలు, ప్రాంతాలకు తరలించడం పూర్తిగా నిషిద్ధం. అలా ఎవరైనా చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేయ డం, జరిమానా విధించేందుకు జిల్లా స్థాయి ఇసుక కమిటీకి పూర్తి అధికారాలు కల్పించారు.
భారీగా జరిమానాలు
ఇసుక అక్రమంగా తవ్వినా, రవాణా చేపట్టినా జరిమానా భారీగా విధించేలా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ట్రాక్టర్‌కైతే మొదటిసారి రూ.10వేలు, రెండో సారి రూ.20వేలు విధించనున్నారు. లారీకి మొదటిసారి రూ.25వేలు, రెండో సారి రూ.50వేలుగా నిర్ణయించారు. పెద్దలారీ, భారీ యంత్రాలకు మొదటిసారి రూ.50, రెండో సారి రూ.లక్ష జరిమానా విధించనున్నారు. ఎద్దులబండికి మొదటిసారి రూ.2వేలు, రెండోసారి రూ.3వేలు, తరువాత రూ.5వేలుగా నిర్ణయించారు. ఇలాంటివి పునరావృతమైతే సంబంధిత వ్యక్తిపై క్రిమినల్ కేసు నమోదు చేసి జైలుకు పంపుతారు.
రాష్ట్ర ప్రగతికి బాటలు
టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీ మేరకు ఉచిత ఇసుక పాలసీని అమలు చేయడం ద్వారా రాష్ట్ర ప్రగతికి బాటలు వేశారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉచిత ఇసుక విధానంతో పేద, మధ్యతరగతి ప్రజలకు భారీగా ఊరట లభించిందన్నారు. వైసీపీ పాలనలో మాజీ సీఎం జగనరెడ్డి ఇసుక మాఫియా రూ.50వేల కోట్లకుపైగా కొల్లగొట్టారని మండిపడ్డారు. గతంలో పేదలు ఇళ్లు కట్టుకునేందుకు రూ.5 లక్షలు ఖర్చు చేస్తే.. అందులో ఇసుక కోసమే రూ.3 లక్షల దాకా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితిని ఎదుర్కొన్నారన్నారు. గృహ నిర్మాణ శాఖకు ఇసుక సరఫరా పేరుతో జగన అండ్ కో 98 లక్షల టన్నుల ఇసుకను లూటీ చేసిందని దుయ్యబట్టారు. వైసీపీనేతలు మింగేసిన ఇసుకతో దాదాపు 10 లక్షలకుపైగా ఇళ్లు కట్టవచ్చునని, దీన్ని బట్టే వైసీపీ నేతలు ఏ స్థాయిలో ఇసుక మాఫియాకు పాల్పడారన్నది ప్రజలు ఆలోచించాలన్నారు.
ప్రజలకు ఊరట
ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ
ఉచిత ఇసుక పాలసీ అమలుతో పేద, మధ్యతరగతి ప్రజలకు భారీ ఊరట లభించిందని అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ సోమవారం ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీని అమలు చేయడంతో అన్నివర్గాల ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు. వైసీపీ పాలనలో మాజీ సీఎం జగనరెడ్డి ఇసుక మాఫియా ద్వారా రూ.వేల కోట్లు కొల్లగొట్టారని ఆరోపించారు. జగనరెడ్డి బినామీ సంస్థ జేపీ వెంచర్స్ చెల్లించాల్సిన రూ.800 కోట్లు మినహా, ప్రజాఽధనాన్ని లూటీ చేశారని దుయ్యబట్టారు. ఎన్డీయే ప్రభుత్వం అమలు చేసిన ఉచిత ఇసుక పాలసీ అమలుపై నిరంతరం పర్యవేక్షణ ఉంటుందన్నారు. ఇసుక అక్రమ తవ్వకాలను నిరోధిస్తూ, నాణ్యమైన ఇసుకను ప్రజలకు ఉచితంగా ఇస్తామని వెల్లడించారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..