Ex Mla ఆలయ భూమిని ఆక్రమించిన ‘విశ్వ’ అనుచరులు
ABN , Publish Date - Dec 23 , 2024 | 12:02 AM
మండలంలోని జనార్దనపల్లి గ్రామానికి చెందిన దేవాలయ భూమిని వైపీసీ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అనుచరులు అక్రమంగా రిజిస్ర్టేషన చేయించుకున్నారని మండల టీడీపీ నాయకులు ఆరోపించారు. ఉరవకొండలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆదివారం వారు విలేకరుల సమావేశం నిర్వహించారు.
టీడీపీ నాయకుల ఆరోపణ
విడపనకల్లు, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): మండలంలోని జనార్దనపల్లి గ్రామానికి చెందిన దేవాలయ భూమిని వైపీసీ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అనుచరులు అక్రమంగా రిజిస్ర్టేషన చేయించుకున్నారని మండల టీడీపీ నాయకులు ఆరోపించారు. ఉరవకొండలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆదివారం వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ ఉరవకొండలోని పాండు రంగస్వామి ఆలయం, విడపనకల్లు మండలంలోని జనార్దనపల్లిలో ఆంజనేయస్వామి, జనార్దనస్వామి, శ్రీరాముస్వామి దేవాలయాలకు నివృత్తి శేషమ్మ అనే మహిళ 1935 సంవత్సరంలో సర్వే నంబరు 141లో 21.05 ఎకరాల భూమిని ఈనాముగా ఇచ్చిందన్నారు. ప్రస్తుతం శేషమ్మ కుటుంబానికి చెందిన వ్యక్తులు ఎవరూ లేరన్నారు. దీన్ని గమనించిన మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అనుచరులు వైసీపీ పాలనలో కోట్లు విలువ చేసే ఈ భూమిని కాజేశారని వెల్లడించారు. కడప జిల్లాకు చెందిన కరూర్ సాయిప్రసాద్, కరూర్ వెంకటశేషశర్మ, కరూర్ భాను ప్రకా్‌షరావులు ఒక్కొక్కరు 7 ఎకరాలు ప్రకారం రిజిస్ర్టేషన చేయించుకున్నారని పత్రాలను కూడా చూపించారు. ప్రస్తుతం ఈ భూమి ఉరవకొండ మండలం లత్తవరం గ్రామానికి చెందిన విశ్వశ్వరరెడ్డి అనుచరుడు కురుబ గోవిందు ఆధీనంలో ఉందన్నారు. దాదాపుగా రూ. 3 కోట్లు విలువ చేసే దేవాలయ భూమిని వైసీపీ నేతల కబంధహస్తాల నుంచి విడిపించి ఆలయాలకు అప్పగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇదే విషయంగా విడపనకల్లు పోలీస్ స్టేషనలో ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు జనార్దనపల్లి సర్పంచ జనార్దననాయుడు, ఎన. రామకృష్ణ, ఎం. పాండురంగా, జి.కావేటి చౌదరి, సి.శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.