Share News

TRANSFERS: ఉత్కంఠ..!

ABN , Publish Date - Aug 24 , 2024 | 11:43 PM

డీఆర్‌డీఏ-వెలుగు, డ్వామా ఉద్యోగుల్లో బదిలీల గుబులు మొదలైంది. ఈనెల 26 లోపు బదిలీ ఆప్షన ఇవ్వాలి. ఈనెల 31కి ఒకేచోట ఐదేళ్లు పని చేసి ఉండాలి. వివిధ కారణాలతో బదిలీ అయ్యే ఉద్యోగులకు సెప్టెంబరు 15 వరకు గడువు ఇచ్చారు.

TRANSFERS: ఉత్కంఠ..!

అనంతపురం క్లాక్‌టవర్‌, ఆగస్టు 24: డీఆర్‌డీఏ-వెలుగు, డ్వామా ఉద్యోగుల్లో బదిలీల గుబులు మొదలైంది. ఈనెల 26 లోపు బదిలీ ఆప్షన ఇవ్వాలి. ఈనెల 31కి ఒకేచోట ఐదేళ్లు పని చేసి ఉండాలి. వివిధ కారణాలతో బదిలీ అయ్యే ఉద్యోగులకు సెప్టెంబరు 15 వరకు గడువు ఇచ్చారు. 15లోపు బదిలీ స్థానాల్లో చేరాల్సి ఉంటుంది. కొందరు కోరిన చోటికి బదిలీ చేయిస్తామని వసూళ్లకు తెరలేపినట్లు సమాచారం.

డ్వామాలో బదిలీ ఫీవర్‌

డ్వామా ఉద్యోగులకు బదిలీ ఫీవర్‌ పట్టుకుంది. డ్వామాలో ఏపీడీ, ఏపీఓ, ఈసీ, టీఏ, కంప్యూటర్‌ ఆపరేటర్‌ల స్థాయి నుంచి బదిలీ ఉంటుంది. ఐదేళ్లు పూర్తి అయిన ఉద్యోగులను బదిలీ చేయనున్నారు. డ్వామా పీడీ ప్రస్తుతం బదిలీపై వెళ్లనున్నారు. కొత్త పీడీ వచ్చేటప్పటికి బదిలీలు పూర్తి కానున్నాయి. డ్వామాలో కీలకంగా ఉండే హెచఆర్‌ విభాగంలో పనిచేసే కీలక అధికారి జిల్లాకు వచ్చి ఐదేళ్లు పూర్తి కానుంది. హెచఆర్‌ విభాగంలో ఉద్యోగుల బదిలీల సినిమా నడుస్తోంది. అయితే ఇప్పటికే హెచఆర్‌ విభాగంలో వసూళ్లపై అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి.


డీఆర్‌డీఏలో...

డీఆర్‌డీఏ-వెలుగులో ఏపీడీ, పీఎం, డీపీఎం, ఏపీఎం, సీసీ, కంప్యూటర్‌ ఆపరేటర్ల స్థాయిలో ఉద్యోగుల బదిలీ ఉంటుంది. ఐదేళ్లు పూర్తి అయిన ఉద్యోగులు తప్పనిసరిగా బదిలీ కావాల్సిందే. రెండు, మూడు నెలల కిందట గతంలో పనిచేసిన పీడీ బదిలీల పేరుతో వసూళ్లకు పాల్పడ్డాడనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం అలాంటి వాతావరణం లేకపోయినా ఆయా స్థాయిలో ఉద్యోగులు బేరసారాలు నడుపుతున్నట్లు తెలుస్తోంది.

27 నుంచి బదిలీల కౌన్సెలింగ్‌

డీఆర్‌డీఏ, డ్వామాలో ఈనెల 27, 28, 29 తేదీల్లో బదిలీ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. ఈనెల 31లోపు బదిలీల కౌన్సెలింగ్‌ పూర్తి చేయాలి. సెప్టెంబరు 1కి బదిలీ అయిన స్థానంలో ఉద్యోగులు విధుల్లో చేరాలి. రిక్వెస్ట్‌, మ్యూచువల్‌, స్పౌజ్‌, మెడికల్‌, అలిగేషన అంశాలు ఉన్న వారికి సెప్టెంబరు 15లోపు బదిలీలు పూర్తి చేయనున్నారు.

Updated Date - Aug 24 , 2024 | 11:43 PM