ATP COLLECTOR : ఓటు హక్కును వినియోగించుకోండి
ABN , Publish Date - Apr 21 , 2024 | 03:05 AM
ఓటు ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అందుకు అవసరమైన ఏర్పాట్లు చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ సూచించారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల విధులకు హాజరయ్యేవారు ఈ నెల 28 వరకు పోస్టల్ బ్యాలెట్‌కోసం ఫారం-12 దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. నియోజకవర్గ కేంద్రంలోని ఆర్వోలకు దరఖాస్తులు ఇవ్వాలని సూచించారు.
పోస్టల్, హోం ఓంటింగ్‌కు దరఖాస్తు చేసుకోండి : కలెక్టర్
అనంతపురం టౌన: ఓటు ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అందుకు అవసరమైన ఏర్పాట్లు చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ సూచించారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల విధులకు హాజరయ్యేవారు ఈ నెల 28 వరకు పోస్టల్ బ్యాలెట్‌కోసం ఫారం-12 దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. నియోజకవర్గ కేంద్రంలోని ఆర్వోలకు దరఖాస్తులు ఇవ్వాలని సూచించారు. వారికి మే 3 నుంచి 6వ తేదీ వరకు ఓటు వేసేందుకు నియోజకవర్గ కేంద్రాలలో ఫెసిలిటీ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని అన్నారు.
ఆయా రోజులలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటు వేయవచ్చని తెలిపారు. రాయదుర్గంలోని కరిబసప్ప ప్రభుత్వ ఉన్నత పాఠశాల, గుంతకల్లులో సర్వేపల్లి రాధాక్రిష్ణ మున్సిపల్ హైస్కూల్, తాడిపత్రిలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, శింగనమలవారికి బుక్కరాయసముద్రం ఆర్డీటీ వినికిడిలోపం విద్యార్థుల పాఠశాల, అనంతపురం అర్బనలో ప్రభుత్వ న్యూటౌన జూనియర్ కళాశాల, కళ్యణదుర్గంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, రాప్తాడు నియోజకవర్గం వారికి పంగల్ రోడ్డులోని టీటీడీసీ సెంటర్‌లో ఫెసిలిటీ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
- నడవలేని స్థితిలో ఉన్న 85 ఏళ్ల వయసు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు ఇళ్లలోనే ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 85 ఏళ్ల పైబడిన వృద్ధులు 9,799 మంది ఉండగా 594 మంది, 25,993 మంది దివ్యాంగులు ఉండగా 720 మంది మాత్రమే హోం ఓటింగ్‌కు ఫారం-డి దరఖాస్తు ఇచ్చారని తెలిపారు. ఈ నెల 23 వరకు దరఖాస్తు చేయవచ్చని తెలిపారు. మే 5 నుంచి 9వ తేదీ వరకు ఇంటివద్దనే ఓటు వేసే అవకాశం కల్పిస్తామని తెలిపారు. జిల్లాలో హోం ఓటింగ్ కోంం మూడు బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు.
- అత్యవసర శాఖల ఉద్యోగులు పోస్టల్ ఓట్ల కోసం ఫారం-12డి దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. వీరికి మే 8 నుంచి 10వ తేదీ వరకు ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తామని తెలిపారు. ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తామని అన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..