Share News

GOD: తొలి ఏకాదశి వేడుకలు

ABN , Publish Date - Jul 19 , 2024 | 12:03 AM

పట్టణంలోని చెరువురోడ్డు సమీపంలో కొండపై వెలసిన ఘనగిరి గర్జ ఆంజనేయస్వామి దేవాలయంలో తొలి ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. స్వామికి గురువారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆలయ సమీపంలో సాయంత్రం నిర్వ హించిన ఉట్లపరుష భక్తులను అమితంగా ఆకట్టుకుంది. ఉట్లమాను ఎక్కడానికి యువ కులు పోటీ పడ్డారు.

GOD:  తొలి ఏకాదశి వేడుకలు
Utlamanu climbing scene at Bareddipalli

రెండో రోజు ఆకట్టుకున్న ఉట్లపరుష

పూజల్లో పాల్గొన్న మంత్రి సవిత ఙ

పెనుకొండ, జూలై 18 : పట్టణంలోని చెరువురోడ్డు సమీపంలో కొండపై వెలసిన ఘనగిరి గర్జ ఆంజనేయస్వామి దేవాలయంలో తొలి ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. స్వామికి గురువారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆలయ సమీపంలో సాయంత్రం నిర్వ హించిన ఉట్లపరుష భక్తులను అమితంగా ఆకట్టుకుంది. ఉట్లమాను ఎక్కడానికి యువ కులు పోటీ పడ్డారు. చివరకు మహేష్‌ అనే యువకుడు ఉట్లమాను ఎక్కి విజేతగా నిలి చాడు. సాయంత్రం జరిగిన కార్యక్రమాలకు రాష్ట్ర బీసీ సంక్షేమం, చేనేత జౌళిశాఖ మంత్రి సవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆమె కు ఆలయ కమిటీ సభ్యులు, భోగసముద్రం జలవనసంరక్షణ సభ్యులు, ఆర్యవైశ్య సభ్యు లు, ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆ మె పేరిట అర్చనలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులను ఆమె సత్కరించారు. కార్య క్రమంలో నాయకులు వెంకటేశులు, పట్టణ కన్వీనర్‌ శ్రీరాములుయాదవ్‌, మాధవనాయు డు, త్రివేంద్రనాయుడు, రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. భక్తులకు ప్రసాదవినియోగం చేశారు.

హిందూపురం(పరిగి) : ప్రతి యేటా మాదిరిగానే తొలి ఏకాదశి వేడుకల సందర్భంగా పరిగి మండలం లోని బారెడ్డిపల్లి వద్ద పెన్నా నదితీరం లో గురువారం ఉట్ల పరుషను ఘ నంగా నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఎద్దఎత్తున తరలి వచ్చి స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఉట్లమాను ఎక్కేం దుకు యువకులు పోటీ పడ్డారు. హెడ్‌కానిస్టేబుల్‌ శ్రీనివాసులు ఆధ్వర్యం లో పోలీసు బందోబస్తు నిర్వమించారు. ఆలయకమిటీ స భ్యులు నరసింహా రెడ్డి, జయసింహారెడ్డి, నాగేంద్ర, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

హిందూపురం(సోమందేపల్లి) : సోమం దేపల్లి మండలంలోని చల్లాపల్లి సమీపంలో వెలసిన కదిరేపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆల యం వద్ద గురువారం సాయంత్రం ఉట్లపరు షను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సమీప గ్రామాల నుంచి భా రీ ఎత్తున భక్తులు తరలివచ్చారు. స్వామి వారిని దర్శించుకున్న అనంతరం ఉట్టికొట్టే కార్య క్రమాన్ని తిలకించారు. మాజీ జడ్పీ టీసీ వెంకటరమణ, రామక్రిష్ణ, శరతచంద్రా రెడ్డి, మధు, సిద్దలింగప్ప, సూరి, వెంకటేశులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి కు మారుడు సాయి ఆలయంలో ప్రత్యేక పూజ లు చేసి, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

Updated Date - Jul 19 , 2024 | 12:03 AM