Follow the rulesనిబంధనలు పాటించాలి
ABN , Publish Date - Dec 31 , 2024 | 01:10 AM
న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ప్రజలు పోలీసు ఆంక్షలను పాటించాలని, లేనిపక్షంలో కేసులు నమోదు చేస్తామని తాడిపత్రి డీఎస్పీ రామకృష్ణుడు, రాయదుర్గం సీఐ జయనాయక్, యాడికి సీఐ ఈరన్న, గుంతకల్లు వనటౌన సీఐ మనోహర్, బొమ్మనహాళ్ ఎస్‌ఐ నబీరసూల్ తదితరులు సోమవారం విలేకురుల సమావేశాల్లో, ప్రకటనలలో వేర్వేరుగా హెచ్చరికలు జారీ చేశారు.
- ప్రజలకు పోలీస్ అధికారుల సూచన
ఆంధ్రజ్యోతి, న్యూస్‌నెట్‌వర్క్: న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ప్రజలు పోలీసు ఆంక్షలను పాటించాలని, లేనిపక్షంలో కేసులు నమోదు చేస్తామని తాడిపత్రి డీఎస్పీ రామకృష్ణుడు, రాయదుర్గం సీఐ జయనాయక్, యాడికి సీఐ ఈరన్న, గుంతకల్లు వనటౌన సీఐ మనోహర్, బొమ్మనహాళ్ ఎస్‌ఐ నబీరసూల్ తదితరులు సోమవారం విలేకురుల సమావేశాల్లో, ప్రకటనలలో వేర్వేరుగా హెచ్చరికలు జారీ చేశారు.
పట్టణాలు, మండలకేంద్రాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు సైతం న్యూఇయర్ వేడుకలను ఇళ్ల వద్ద కుటుంబసభ్యులతో ప్రశాంతంగా నిర్వహించుకోవాలన్నారు. మంగళవారం రాత్రి 10 గంటల నుంచి పోలీస్ 30 యాక్టు అమల్లో ఉంటుందన్నారు. పబ్లిక్ స్థలాల్లో టపాసులు కాల్చరాదన్నారు. త్రిబుల్‌రైడింగ్, ఓవర్‌స్పీడ్‌తో ద్విచక్రవాహనాలు నడపరాదన్నారు. రోడ్లపై కేక్‌కట్టింగ్‌లు చేయరాదన్నారు. ఎవరైనా అలా చేస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. సన్నిహితులు, కుటుంబసభ్యులతో ప్రశాంతంగా వేడుకలను ఇళ్ల వద్ద జరుపుకోవాలని సూచించారు. 31వ తేదీ రాత్రి నుంచి ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తామన్నారు. ప్రధాన కూడళల్లో డ్రంక్ అండ్ డ్రైవ్, వాహనాల తనిఖీలు చేపడతామన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపిన వారికి రూ.10వేలు జరిమానా లేదా ఆరునెల ల జైలు శిక్ష ఉంటుందన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులు మైనర్లకు ద్విచక్రవాహనాలను ఇవ్వకుండా జాగ్రత్త పడాలని వారు సూచించారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..