RAIN : గాలీవాన బీభత్సం
ABN , Publish Date - May 22 , 2024 | 12:43 AM
జిల్లాలో సోమవారం రాత్రి గాలీవాన బీభత్సం సృష్టించాయి. నగరంలో భారీ ఎత్తున చెట్లు, విద్యుత స్తంభాలు నేలకొరిగాయి. సమీపంలో పార్క్ చేసిన వాహనాలు ధ్వంసమయ్యాయి. నగరంలో అర్ధరాత్రి ఒంటి గంట వరకూ అంధకారం అలుముకుంది. కొన్ని కాలనీల్లో ఉదయం వరకూ విద్యుత సరఫరా సాధ్యం కాలేదు. శివారు కాలనీలలో మంగళవారం రాత్రి వరకూ విద్యుత సరఫరాను పునరుద్ధరించలేదు. ప్రధాన రహదారులు, కాలనీలు జలమయమయ్యాయి. డ్రైనేజీ కాలువలు పొంగిపొర్లడంతో నగరంలో అపరిశుభ్ర వాతావరణం నెలకొంది.
నేలకొరిగిన వృక్షాలు, విద్యుత స్తంభాలు
విద్యుత సరఫరాకు తీవ్ర అంతరాయం
చీకట్లో అనంతపురం, శివారు ప్రాంతాల్సుం
అనంతపురం క్రైం/అర్బన/రూరల్, మే 21: జిల్లాలో సోమవారం రాత్రి గాలీవాన బీభత్సం సృష్టించాయి. నగరంలో భారీ ఎత్తున చెట్లు, విద్యుత స్తంభాలు నేలకొరిగాయి. సమీపంలో పార్క్ చేసిన వాహనాలు ధ్వంసమయ్యాయి. నగరంలో అర్ధరాత్రి ఒంటి గంట వరకూ అంధకారం అలుముకుంది. కొన్ని కాలనీల్లో ఉదయం వరకూ విద్యుత సరఫరా సాధ్యం కాలేదు. శివారు కాలనీలలో మంగళవారం రాత్రి వరకూ విద్యుత సరఫరాను పునరుద్ధరించలేదు. ప్రధాన రహదారులు, కాలనీలు జలమయమయ్యాయి. డ్రైనేజీ కాలువలు పొంగిపొర్లడంతో నగరంలో అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. ఓ వైపు అంధకారం, మరోవైపు అపరిశుభ్రతతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామీణ
ప్రాంతాలలో విద్యుత సరఫరా వ్యవస్థ దెబ్బతింది. దీంతో మంగళవారం రాత్రి వరకూ విద్యుత సరఫరాను పునరుద్ధరించలేదు. ఉమ్మడి జిల్లాలోని విద్యుత శాఖ సర్కిల్ ఆరు డివిజన్ల పరిధిలో 162 విద్యుత స్తంభాలు, 12 ట్రాన్సఫార్మర్లు కూలిపోయాయి. దీంతో ఆ శాఖకు రూ.37.72 లక్షలు నష్టం జరిగినట్లు అధికారులు అంచాన వేశారు.
గాలీవాన బీభత్సానికి అనంతపురం నగరవాసులు నరకం అనుభవించారు. సోమవారం రాత్రి 9 గంటల సమయంలో విద్యుత సరఫరా నిలిచిపోయింది. నాలుగో రోడ్డు, యువజన కాలనీ, ఎంజీఎం, జనశక్తి నగర్, వేణుగోపాల్ నగర్, బళ్లారి రోడ్డు, హౌసింగ్ బోర్డు, రామ్‌నగర్, సోమనాథ్‌నగర్ ఆర్కే నగర్, ఇందిరానగర్ ప్రాంతాల్లో రాత్రి పదుల సంఖ్యలో చెట్లు, విద్యుత స్తంభాలు కూలిపోయాయి. హౌసింగ్ బోర్డులో చెట్లు కూలి వాహనాలు ధ్వంసమయ్యాయి.
28 మండలాల్లో వర్షం
జిల్లాలోని 28 మండలాల్లో సోమవారం రాత్రి వర్షం కురిసింది. అత్యధికంగా రాప్తాడులో 45.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. అనంతపురం 37.2, బుక్కరాయసముద్రంలో 34.2, నార్పలలో 28.2, కంబదూరులో 20.2, గార్లదిన్నెలో 20, శింగనమల 18.8, పామిడిలో 17.6, కణేకల్లు 17.2, గుత్తి 16.2, ఆత్మకూరు 15.6, గుమ్మఘట్ట 14.8, యాడికి 13.4, బొమ్మనహాళ్ 13.2, శెట్టూరు 12.4, వజ్రకరూరులో 12.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. మిగతా మండలాల్లో 10.6 మి.మీ.లోపు నమోదైంది.
ఉద్యాన పంటలకు నష్టం
కూడేరు, ఉరవకొండ, అనంతపురం, బెళుగుప్ప మండలాల్లో గాలీవానకు అరటి పంట నేలకొరిగింది. కుందుర్పి, శెట్టూరులో టమోటా పంట దెబ్బతింది. పది మంది రైతులకు చెందిన 15.40 హెక్టార్లల్లో రూ.54 లక్షల విలువైన అరటి పంటకు నష్టం జరిగిందని ఉద్యాన శాఖ అధికారులు అంచనా వేశారు. ఈ నెలలో ఇప్పటి దాకా వర్షం ప్రభావంతో 56.60 హెక్టార్లల్లో రూ.1.80 కోట్ల విలువైన అరటి దెబ్బతింది. 1.80 హెక్టార్లల్లో రూ.3 లక్షల విలువైన టమోటాకు నష్టం జరిగింది. మొత్తం 58.40 హెక్టార్లల్లో రూ.1.83 కోట్ల విలువైన పంటలు దెబ్బతిన్నాయి.
ఒకే రైతుకు రూ.70 లక్షల నష్టం
అనంతపురం రూరల్ మండలంలో సోమవారం రాత్రి వీచిన ఈదురుగాలకు కురుగుంట రైతు జి. లక్ష్మినారాయణరెడ్డి సాగుచేసిన అరటి నేలకొరిగి దెబ్బతినింది. పది ఎకరాల్లో పంట సాగుకు రూ.35 లక్షల వరకు పెట్టుబడి పెట్టానని, వారం క్రితం కొంత, తాజాగా మొత్తం పంట దెబ్బతినిందని బాధిత రైతు వాపోయారు. ఇప్పటి వరకు ఒక లోడు రూ.1.60 లక్షలకు అమ్మానని, మరో 50 లోడుల దిగుబడి వచ్చేదని అన్నారు. వర్షం కారణంగా రూ.70 లక్షల వరకూ పంట నష్టపోయానని, ప్రభుత్వం ఆదుకోవాలని కోరాడు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..