Share News

GOD : కన్నులపండువగా గంగమ్మ జ్యోతుల ఉత్సవం

ABN , Publish Date - Jun 11 , 2024 | 11:14 PM

పట్టణ పరిధిలోని రెండో మోడల్‌ కాలనీలో వెలసి న గంగమ్మ దేవత ఆలయంలో మంగళవారం జ్యోతుల మహో త్సవాన్ని ఘనంగా నిర్వహించా రు. ఈ కార్యక్రమం బెస్త సం ఘం ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా తెలవారు జాము న నుంచే అమ్మవారి మూల విరాట్‌కు వివిధ అభిషేకాలు చేసి ప్రత్యేకంగా అలంకరిం చా రు. అర్చనలు తదితర పూజా కార్యక్రామలు చేశారు.

GOD : కన్నులపండువగా గంగమ్మ జ్యోతుల ఉత్సవం
Women carrying torches

హిందూపురం అర్బన, జూన 11: పట్టణ పరిధిలోని రెండో మోడల్‌ కాలనీలో వెలసి న గంగమ్మ దేవత ఆలయంలో మంగళవారం జ్యోతుల మహో త్సవాన్ని ఘనంగా నిర్వహించా రు. ఈ కార్యక్రమం బెస్త సం ఘం ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా తెలవారు జాము న నుంచే అమ్మవారి మూల విరాట్‌కు వివిధ అభిషేకాలు చేసి ప్రత్యేకంగా అలంకరిం చా రు. అర్చనలు తదితర పూజా కార్యక్రామలు చేశారు.


ఈ సందర్భంగా పెద్ద ఎత్తున మహిళలు జ్యోతులు తలపై ఎ త్తుకుని లక్ష్మీపురం రామభజన మందిరం వద్ద నుంచి గంగమ్మ ఆలయం వరకు ఊరేగింపు తీసుకొచ్చారు. అమ్మవారికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఊరేగింపు సందర్భంగా డప్పులు, ఉరాల మోతతో పరిసర ప్రాంతం మార్మోగింది. హిందూపురం పట్టణం, చుట్టు పక్క గ్రామాల ప్రజలతో పాటు కర్ణాటక ప్రాంతం నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకు న్నారు. కోరిన కోర్కెలు తీర్చే తల్లిగా అమ్మవారిని కొలుస్తున్నారు. ఈ జాతరను మూడు సంవత్సరాలకు ఒకమారు నిర్వహిస్తామని బెస్త సంఘం పట్టణ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, కార్యదర్శి శివయ్య, కోశాధికారి అనిల్‌కుమార్‌, సంయుక్త కార్యదర్శి లక్ష్మీనారాయణ తెలిపారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jun 11 , 2024 | 11:14 PM