వైభవంగా కడ్లే గౌరమ్మ రథోత్సవం
ABN , Publish Date - Nov 19 , 2024 | 01:00 AM
మండల కేంద్రంలో కడ్లే గౌరమ్మ పూల రథోత్పవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్థానిక బసవేశ్వర స్వామి ఆలయంలో కొలువు దీరిన కడ్లేగౌరమ్మ అమ్మవారికి గ్రామస్థులు గత నాలుగు రోజులుగా విశేషపూజలు చేశారు.
విడపనకల్లు, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో కడ్లే గౌరమ్మ పూల రథోత్పవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్థానిక బసవేశ్వర స్వామి ఆలయంలో కొలువు దీరిన కడ్లేగౌరమ్మ అమ్మవారికి గ్రామస్థులు గత నాలుగు రోజులుగా విశేషపూజలు చేశారు.
చివరిరోజైన సోమవారం నిమజ్జనంతో వేడుకలు ముగిశాయి. ఈ సందర్భంగా తెల్లవారు జామున అమ్మవారి విగ్రహాన్ని పూల రథంలో కొలువుదీర్చి స్థానిక బస్టాండ్ వద్ద ఉన్న గౌరమ్మ బావి వరకూ ఊరేగింపు జరిపారు. ఆడపడుచులు మంగళహారతులతో రథం ముందు కదిలారు. కళాకారులు నంది కోళ్లు, చెక్క భజనలు, కోలాటాలతో సందడి చేశారు. విడపనకల్లు, మాళాపురం, వేల్పుమడుగు, ఆర్ కొట్టాల, వీ కొత్తకోట గ్రామాలతోపాటు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు. స్థానిక గౌరమ్మ బావిలో అమ్మవారి విగ్రహాన్ని నిమజ్జనం చేయటంతో వేడుకలు ముగిశాయి.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..