NARASIMHA SWAMY : వైభవంగా పెన్నోబులేశుడి పల్లకి సేవ
ABN , Publish Date - Aug 04 , 2024 | 12:01 AM
మండల పరిధిలోని పెన్నహోబిలం లక్ష్మీ నరసిం హస్వామి ఆలయంలో శనివారం స్వామి వారి పల్లకి సేవను వైభవంగా నిర్వహించారు. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేశారు. ఉత్సవమూర్తిని పట్టువస్ర్తాలతో అలంకరించి పల్లకిలో కొలువుదీ ర్చారు. మేళతాళాల మధ్య ఆలయం చుట్టూ ఊరే గించారు. ఆషాఢ మాసం చివరి శనివారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి, స్వామిని దర్శించుకున్నారు.
ఉరవకొండ, ఆగస్టు3: మండల పరిధిలోని పెన్నహోబిలం లక్ష్మీ నరసిం హస్వామి ఆలయంలో శనివారం స్వామి వారి పల్లకి సేవను వైభవంగా నిర్వహించారు. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు చేశారు. ఉత్సవమూర్తిని పట్టువస్ర్తాలతో అలంకరించి పల్లకిలో కొలువుదీ ర్చారు. మేళతాళాల మధ్య ఆలయం చుట్టూ ఊరే గించారు. ఆషాఢ మాసం చివరి శనివారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి, స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
రాయదుర్గంరూరల్: పట్టణంలోని సంతాన వేణుగోపాలస్వామి ఆల యంలో శనివారం పల్లకిసేవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినట్లు దేవాల య కమిటీ అధ్యక్షుడు బంగి శంకర్ తెలిపారు. స్వామివారికి ఉదయాన్నే పం చామృతాభిషేకం, కుంకుమార్చన తదితర పూజలు నిర్వహించారు. సాయం త్రం స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని పల్లకిలో ఉంచి ఊరేగించారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....