Share News

PROTEST : జీఓ 84ను రద్దు చేయాలి

ABN , Publish Date - Aug 29 , 2024 | 12:00 AM

జీఓ 84ను రద్దుచేయాలని మునిసిపల్‌ ఉపాధ్యాయులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బుధవారం ఎంజీ ఎం పాఠశాల వద్ద మునిసిపల్‌ ఉపాధ్యాయులు భోజన విరామ సమయంలో ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ... జీఓ నెంబర్‌ 84 వల్ల రెండేళ్లుగా మున్సిపల్‌ విద్యావ్యవస్థ సర్వనా శనం అయిందన్నారు. పాఠశాల విద్యాశాఖ ఆధీనంలోకి మునిసిపల్‌ విద్యావ్యవస్థను తెచ్చేందుకు గత వైసీపీ పాలనలో ఈ జీఓను తెచ్చారని మండిపడ్టారు.

PROTEST : జీఓ 84ను రద్దు చేయాలి
Teachers protesting at MJM school

మునిసిపల్‌ ఉపాధ్యాయుల నిరసన

హిందూపురం, ఆగస్టు 28 : జీఓ 84ను రద్దుచేయాలని మునిసిపల్‌ ఉపాధ్యాయులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బుధవారం ఎంజీ ఎం పాఠశాల వద్ద మునిసిపల్‌ ఉపాధ్యాయులు భోజన విరామ సమయంలో ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ... జీఓ నెంబర్‌ 84 వల్ల రెండేళ్లుగా మున్సిపల్‌ విద్యావ్యవస్థ సర్వనా శనం అయిందన్నారు. పాఠశాల విద్యాశాఖ ఆధీనంలోకి మునిసిపల్‌ విద్యావ్యవస్థను తెచ్చేందుకు గత వైసీపీ పాలనలో ఈ జీఓను తెచ్చారని మండిపడ్టారు.


అప్‌గ్రేడ్‌ కాబడిన పాఠశాలలకు పోస్టులను మంజూరు చేయలేదని, విద్యార్థుల సంఖ్యను బట్టి ఉపాధ్యాయులను నియమించ లేదన్నారు. దీంతో విద్యా ప్రమాణాలు దెబ్బతింటున్నాయన్నారు. ప్రభుత్వ, జిల్లాపరిషత పాఠశాలలతో సమానంగా అన్ని సౌకర్యాలు కల్పి స్తామని చెప్పిన విద్యాశాఖ అధికారులు మునిసిపల్‌ ఉపాధ్యాయులను పట్టించుకోవడం కోలేదని ఆవేదన చెందారు. పురపాలక చట్టాలకు అను గుణంగా... సర్వీసు ఆధారంగా పాఠశాలలకు పోస్టులు మంజూరు చేసి, బదిలీలు చేపట్టాలని, ఉద్యోగోన్న తులు కల్పించాలని డిమాండ్‌ చేశారు.


ఆ తరువాతే వర్క్‌ అడ్జెస్ట్‌మెంట్‌ చేపట్టాలన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి జీఓ రద్దుచేసి మునిసిపల్‌ ఉపాధ్యాయుల సమస్య పరిష్క రించాలన్నారు. కార్యక్రమంలో ఏపీఎంటీఎఫ్‌ నాయకులు పాల్గొన్నా రు. పట్టణ పరిధిలోని అన్ని మున్సిపల్‌ పాఠశాలల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కార్యక్రమంలో ఎంటీఎఫ్‌ హిందూపురం కమిటీ అధ్యక్షుడు చంద్రానాయక్‌, ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ, నాయకులు పెన్నోబులు, వేణుగోపాల్‌, మల్లికార్జునరెడ్డి, జనార్ధన, ఇమ్రాన, హరిప్రసాద్‌, జగదీష్‌, నగేష్‌, కేవవరెడ్డి, రామాంజినేయులు, అన్సర్‌ తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Aug 29 , 2024 | 12:00 AM