Happy Engineer's Day ఘనంగా ఇంజనీర్స్ డే
ABN , Publish Date - Sep 16 , 2024 | 12:14 AM
భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వర య్య జయంతి సందర్భంగా పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఆదివా రం జేవీవీనాయకులు ఇంజనీర్స్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భం గా మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
- మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు ఘన నివాళి
గుంతకల్లుటౌన, సెప్టెంబరు 15: భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వర య్య జయంతి సందర్భంగా పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఆదివా రం జేవీవీనాయకులు ఇంజనీర్స్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భం గా మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం మున్సిపల్ ఇంజనీర్ గుర్రప్పయాదవ్‌ను ఉత్తమ ఇంజనీరిం గ్ అవార్డుతో సత్కరించారు. కార్యక్రమంలో జేవీవీ వ్యవస్థాపక అధ్యక్షుడు గం గరాజు, రాష్ట్ర కార్యదర్శి హరిప్రసాద్ యాదవ్, రిటైర్డ్ తహసీల్దార్ ఈఓ రాముడు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా రోటరీ ఇంగ్లిష్ మీడియం పా ఠశాలలో ఇంజనీర్స్ డే పురస్కరించుకుని మున్సిపల్ టౌనప్లానింగ్ సూపర్‌వైజర్ అబ్దుల్‌సత్తార్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ ఇనచార్జి మురళీమోహనకు రోటరాక్ట్ అర్బన ప్లానింగ్ ఎక్సలెన్స అవార్డు ప్రదానం చేశారు. రోటరాక్ట్ జిల్లా ప్రతినిధి నాగార్జున కర్ణాటకం మాట్లాడుతూ పట్టణ అభివృద్ధిలో ఇరువురు సాధించిన విజయాలకు గాను ఈ అవార్డులను ప్రదానం చేశామన్నారు. అనంతరం అబ్దుల్‌సత్తార్, మురళీమోహనకు పూలమాలలువేసి శాలువాలతో సత్కరించి, జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షుడు శివానంద, కార్యదర్శి శ్రీనివాసులు, ఇన్నర్‌వీల్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..