Share News

VYASA MAHARSHI: ఘనంగా వ్యాసమహర్షి జయంతి

ABN , Publish Date - Jul 21 , 2024 | 11:51 PM

భగవాన వ్యాస మహర్షి జయంతి వేడుకలను ఆదివారం మొదటిరోడ్డులోని కాశీవిశ్వేశ్వర కోదండ రామాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆలయంలో జగద్గురువు ఆదిశంకరాచార్యులు, దత్తాత్రేయ స్వామి విగ్రహాలకు వేదపండితుడు సుంకేశుల సత్యనారాయణశర్మ, ఆలయ అనువంశీకుడు హోసూరు రామసుబ్రహ్మణ్యం నేతృత్వంలో బ్రాహ్మణ వేదపాఠశాల విద్యార్థులతో అభిషేకాలు, వేదపఠనం చేశారు.

VYASA MAHARSHI: ఘనంగా వ్యాసమహర్షి జయంతి
Students of the Vedic School conducting Sankaracharya Nagarotsavam

అనంతపురం కల్చరల్‌, జూలై 21: భగవాన వ్యాస మహర్షి జయంతి వేడుకలను ఆదివారం మొదటిరోడ్డులోని కాశీవిశ్వేశ్వర కోదండ రామాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆలయంలో జగద్గురువు ఆదిశంకరాచార్యులు, దత్తాత్రేయ స్వామి విగ్రహాలకు వేదపండితుడు సుంకేశుల సత్యనారాయణశర్మ, ఆలయ అనువంశీకుడు హోసూరు రామసుబ్రహ్మణ్యం నేతృత్వంలో బ్రాహ్మణ వేదపాఠశాల విద్యార్థులతో అభిషేకాలు, వేదపఠనం చేశారు. అనంతరం పురవీధుల్లో శంకరాచార్యుల నగరోత్సవం చేయడంతోపాటు గోసేవ బృందంచే నృత్యకోలాట ప్రదర్శనలు నిర్వహించారు. కార్యక్రమంలో అంతర్రాషీ్ట్రయ హిందూ పరిషత జిల్లా అధ్యక్షుడు మఠం ఆనంద్‌కుమార్‌, రాషీ్ట్రయ బజరంగదళ్‌ జిల్లా అధ్యక్షుడు భూదేటి అమర్‌బాబు, కార్యకర్తలు కృష్ణకుమార్‌గౌడ్‌, మధుబాబు పాల్గొన్నారు.

Updated Date - Jul 22 , 2024 | 12:05 AM