ENVIRONMENT ; ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం
ABN , Publish Date - Jun 06 , 2024 | 12:26 AM
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని మండలంలో బుధవారం నిర్వహిం చారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో సూపర్‌వైజర్లు నాగ రాణి, రజిత అంగనవాడీ కార్యకర్తలతో కలిసి పర్యా వరణ దినోత్సవాన్ని జరిపారు. సూపర్ వైజర్ రజిత ఆధ్వర్యంలో గోరంట్ల ఎమ్మార్సీలో మొక్కలు నాటే కా ర్యక్రమాన్ని నిర్వహించారు. ఖాజాపురంలో సూపర్ వైజర్ నాగరాణి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి పర్యావరణ పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.
గోరంట్ల, జూన 5: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని మండలంలో బుధవారం నిర్వహిం చారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో సూపర్‌వైజర్లు నాగ రాణి, రజిత అంగనవాడీ కార్యకర్తలతో కలిసి పర్యా వరణ దినోత్సవాన్ని జరిపారు. సూపర్ వైజర్ రజిత ఆధ్వర్యంలో గోరంట్ల ఎమ్మార్సీలో మొక్కలు నాటే కా ర్యక్రమాన్ని నిర్వహించారు. ఖాజాపురంలో సూపర్ వైజర్ నాగరాణి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి పర్యావరణ పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అంగనవాడీ కేంద్రంలో మొక్కలు నాటారు. సెక్టారు పరిఽధిలోని అంగనవాడీ కార్యకర్తలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
అగళి: పర్యావరణాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి సంరక్షించాలని ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ జాఫర్ తెలిపారు. అగళి మండ ల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల ఆవరణంలో మొ క్కలు నాటి పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకున్నా రు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.
పావగడ : ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని తాలూకాలోని నీలంపల్లిలోని ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు, గ్రామ పంచాయతీ పీడీఓలు అంగనవాడీ కార్యకర్తలు, గ్రంఽథాలయ సిబ్బందితో కలిసి నిర్వహించారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి తేనే మానవజాతికి మనుగడ సాధ్యమవుతుందని గ్రామపంచాయతీ పీడీఓ చిన్నయ్య అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యాక్రమంలో పాఠశాల ప్రధా నోపాధ్యాయుడు శంకర్‌నాయక్, బిల్ కలెక్టర్‌లు బాలు, హనుమంతరాయ, కార్యదర్శి వెంకటనారా యణ తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....