Home » Environmental rights
వర్టికల్ ఫార్మింగ్ గురించి మనకు తెలుసు! నియంత్రిత వాతావరణంలో మొక్కలను పెంచడమూ కొత్త కాదు!! కానీ.. ఈ రెండింటీకీ కృత్రిమ మేధను కూడా జోడిస్తే? పసిపాపల్లా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన మొక్కలను ఏఐ ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, ఫొటోలు తీసి వాటికి ఏం కావాలో విశ్లేషిస్తూ, కావాల్సిన పోషకాలు ఎప్పటికప్పుడు అందేలా చేస్తే?
‘ఇప్పుడు ఎక్కడ చూసినా కాలుష్యం. జలం, వాయువు, భూమి... తెలిసీ తెలియక మనం చేస్తున్న పనులవల్ల ప్రకృతి కళ తప్పింది. పర్యావరణంలో అనూహ్య మార్పులు చోటుచేసుకొంటున్నాయి. ఇవి మనకు ప్రమాద సంకేతాలు.
మదురై శుభశ్రీకి ఔషధ మొక్కల పెంపకమంటే కాలక్షేపం కాదు. ప్రాచీన వైద్య సంప్రదాయాల్ని పరిరక్షించే ఒక యజ్ఞం. అయిదువందలకు పైగా అరుదైన జాతులకు నెలవైన ఆమె ఔషధ వనం ఇప్పుడు పరిశోధనా విద్యార్థులకు అధ్యయన కేంద్రంగా మారింది.
మండలంలోని గండికొవ్వూరు గ్రామం లో ఇసుకు రీచకు సంబంధించి డీఆర్వో గంగాధర్‌గౌడ్ పర్యావరణ ప్రజాభిప్రాయసేకరణ నిర్వహించారు.
సమాజంలో పచ్చదనం పర్యావరణానికి వరంలాంటిదనం వక్తలు పేర్కొన్నారు.
కాలుష్య నియంత్రణ మండలిలో కొందరు అధికారులు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలనే బేఖాతరు చేస్తున్నారు! వద్దన్న పని చేయడానికే సిద్ధమవుతున్నారు.. ప్రభుత్వం మారినా వారిలో వైసీపీ వాసన వీడడంలేదు!
పర్యావరణపై పరిరక్షణపై విపరీతమైన ఆసక్తి ఉన్న ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. చెత్తతో సంపద అంశానికి ఆకర్షితుడయ్యారు. తమిళనాడుకు చెందిన నిపుణుడు శ్రీనివాసన్‌ను మళ్లీ చెత్తతో సంపద తయారీకి సంబంధించి కన్సల్టెంట్‌గా నియమించి గ్రామ పంచాయతీల్లో ఈ ప్రయోగాన్ని మళ్లీ మరోసారి అమలు చేయాలని భావించారు.
మనిషి అత్యాశకు పోయి ప్రకృతితో ఆటలాడితే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది! అలనాటి కేదారనాథ్ వరదల నుంచి.. కేరళను ఏటా కుదిపేస్తున్న వరదలు, కొండచరియలు విరిగిపడడం వంటి ఉత్పాతాలన్నీ ఇందుకు ఉదాహరణలే. పశ్చిమ కనుమల స్థితిగతులపై అంచనా వేయడానికి 2010 మార్చిలో అప్పటి కేంద్ర పర్యావరణ శాఖ ఏర్పాటు
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని మండలంలో బుధవారం నిర్వహిం చారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో సూపర్వైజర్లు నాగ రాణి, రజిత అంగనవాడీ కార్యకర్తలతో కలిసి పర్యా వరణ దినోత్సవాన్ని జరిపారు. సూపర్ వైజర్ రజిత ఆధ్వర్యంలో గోరంట్ల ఎమ్మార్సీలో మొక్కలు నాటే కా ర్యక్రమాన్ని నిర్వహించారు. ఖాజాపురంలో సూపర్ వైజర్ నాగరాణి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి పర్యావరణ పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.
రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణతో సుస్థిర అభివృద్ధి సాధ్యమవుతుందని, ఇందుకుగాను పర్యావరణ కమిషన్ ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో క్లీన్/గ్రీన్ ఎనర్జీ కోసం పంప్డ్ స్టోరేజీ, సౌర, పవన, జలవిద్యుత్ ప్రాజెక్టులను వేగంగా నిర్మిస్తామని ప్రకటించారు.