Land Titling Act ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై హర్షం
ABN , Publish Date - Jun 17 , 2024 | 12:41 AM
గత వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని చంద్రబాబు అధికారంలోకి రాగానే రద్దు చేయడం హర్షనీయమని ఏపీ రైతుసంఘం జిల్లా సహాయ కార్యదర్శి జేవీరమణ అన్నారు.
ధర్మవరం, జూన 16: గత వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని చంద్రబాబు అధికారంలోకి రాగానే రద్దు చేయడం హర్షనీయమని ఏపీ రైతుసంఘం జిల్లా సహాయ కార్యదర్శి జేవీరమణ అన్నారు.
పట్టణంలోని రైతుసం ఘం కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా గత వైసీపీ ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ చట్టం తీసుకొచ్చిందన్నారు. ఆ చట్టాన్ని రద్దు చేయాలని రైతుసంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేశామని, ఫలితం లేకపోయిందని తెలిపారు. ఎన్నికల్లో చంద్రబాబు అధికారంలోకి రాగానే ఈ చట్టాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చారన్నారు. అందుకు రైతులు, ప్రజలు ఆయన్ను గెలిపించారని తెలిపారు. అధికారంలోకి రాగానే చంద్రబాబు ఇచ్చిన మాట నెలబెట్టుకున్నారని సంతోషం వ్యక్తం చేశారు. ఇందుకు సీఎంకు రైతుసంఘం రాష్ట్ర సమితి తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం...