Share News

GENERAL HOSPITAL : ఓపీలో నరకం

ABN , Publish Date - May 17 , 2024 | 12:27 AM

సర్వజన వైద్యశాలలో ఓపీ కౌంటర్‌ అత్యంత అసౌకర్యంగా మారింది. రోగులు, వారి బంధువులు గంటల తరబడి క్యూలో ఉండాల్సి వస్తోంది. ఓపీ, ఇనపేషెంట్ల అడ్మిషన కౌంటర్లు ఒకేచోట ఏర్పాటు చేయడం, మహిళలు, పురుషులకు కలిపి కౌంటర్లు ఉండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైద్యం కోసం వస్తే కొత్త రోగాలు సోకేలా ఉన్నాయని బాధితులు వాపోతున్నారు. జిల్లా ఆస్పత్రిలో ఓపీ చీటీలకు గతంలో మహిళలకు, పురుషులకు వేర్వేరు కౌంటర్లు ఉండేవి. అవి ఆస్పత్రి ప్రధాన ద్వారం వద్ద ఉండటంతో వైద్యులు, సిబ్బందికి, రోగులకు ఇబ్బందికరంగా ఉన్నాయని భావించారు. సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వెంకటేశ్వరరావు, ఆర్‌ఎంఓలు, ఇంజినీరింగ్‌ అధికారులు చర్చించుకుని.. రోగుల విశ్రాంతి

GENERAL HOSPITAL : ఓపీలో నరకం
Congestion at OP ticket counters

ఒకే చోట స్త్రీపురుషుల కౌంటర్లు

చీటీల కోసం గంటలు గంటలు

అనంతపురం టౌన, మే 16: సర్వజన వైద్యశాలలో ఓపీ కౌంటర్‌ అత్యంత అసౌకర్యంగా మారింది. రోగులు, వారి బంధువులు గంటల తరబడి క్యూలో ఉండాల్సి వస్తోంది. ఓపీ, ఇనపేషెంట్ల అడ్మిషన కౌంటర్లు ఒకేచోట ఏర్పాటు చేయడం, మహిళలు, పురుషులకు కలిపి కౌంటర్లు ఉండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైద్యం కోసం వస్తే కొత్త రోగాలు సోకేలా ఉన్నాయని బాధితులు వాపోతున్నారు. జిల్లా ఆస్పత్రిలో ఓపీ చీటీలకు గతంలో మహిళలకు, పురుషులకు వేర్వేరు కౌంటర్లు ఉండేవి. అవి ఆస్పత్రి ప్రధాన ద్వారం వద్ద ఉండటంతో వైద్యులు, సిబ్బందికి, రోగులకు ఇబ్బందికరంగా ఉన్నాయని భావించారు. సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వెంకటేశ్వరరావు, ఆర్‌ఎంఓలు, ఇంజినీరింగ్‌ అధికారులు చర్చించుకుని.. రోగుల విశ్రాంతి


గదులను ఆధునికీకరించి ఓపీ కౌంటర్లను అక్కడికి మార్చారు. కానీ మహిళలు, పురుషులు, ఇనపేషెంట్ల అడ్మిషన కౌంటర్లు ఒకేచోట ఏర్పాటు చేశారు. రోజుకు 1500 నుంచి రెండు వేలమంది వరకు రోగులు ఆస్పత్రికి వస్తుంటారు. దీంతో ఓపీ కౌంటర్లు కిటకిటలాడుతున్నాయి. ఎండాకాలం కావడం, రేకుల షెడ్డులో గాలిదూరకుండా మూసివేయడంతో రోగులు అల్లాడిపోతున్నారు. ఓపీ చీటీ కోసం గంట నుంచి రెండు గంటలు వేచి చూడాల్సి వస్తోందని వాపోతున్నారు. ఓపీ చీటీలకు ఆధార్‌ అనుసంధానం పెట్టడంతో మరింత జాప్యం జరుగుతోంది.

ఆధార్‌ లేదని తిప్పుతున్నారు

ఆరోగ్యం బాగాలేదు. వైద్యం కోసం ఆస్పత్రికి వచ్చాను. ఓపీ చీటీ కోసం గంటపాటు క్యూలో ఉన్నారు. తీరా నా వంతు వచ్చాక ఆధార్‌ లేకుంటే ఇవ్వమని అంటున్నారు. రెండు గంటల నుంచి అటూ ఇటు తిప్పుతున్నారు.

- సాదిక


ఉక్కపోతతో అల్లాడిపోతున్నాం

ఓపీ చీటీల కౌంటర్‌లో నరకం చూపిస్తున్నారు. గంటన్నరపాటు లైనలో ఉన్నా ఓపీ చీటీ అందలేదు. పైగా ఉక్కుపోతతో అల్లాడి పోతున్నాం.

- లక్ష్మీదేవి

ఒకే చోట ఉన్నందుకే సమస్య..

రెండు గంటలుగా క్యూలో ఉన్నా ఓపీ చీటీ దొరకలేదు. రేకులు షెడ్డు కావడంతో ఉక్కుపోతతో అల్లాడిపోతున్నాం. ఒకేచోట కౌంటర్లు పెట్టడం వల్లనే ఈ సమస్య ఏర్పడుతోంది. మరిన్ని కౌంటర్లు ఏర్పాటు చేసి, అధికారులు సమస్యను పరిష్కరించాలి.

- ఈశ్వరమ్మ

మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - May 17 , 2024 | 12:27 AM