Share News

DAMAGED ROADS: ఇంకెన్నాళ్లు..?

ABN , Publish Date - Sep 10 , 2024 | 12:08 AM

ఆ రోడ్డు నిత్యం రద్దీతో ఉంటుంది. గ్రామాల నుంచి వివిధ పనులు నిమిత్తం వచ్చేవారు కొందరైతే... జిల్లా కేంద్రం నుంచి కళాశాలలు, గ్రామాలకు వెళ్లే వారు మరికొందరు. వందల వాహనాలు ఆ రోడ్డుపై నిత్యం రాకపోకలు సాగిస్తుంటాయి.

DAMAGED ROADS: ఇంకెన్నాళ్లు..?
A view of no divider in the middle of the road near Rudrampet Circle

దుమ్ముధూళితో స్థానికుల సహజీవనం

నిత్యం అవస్థల ప్రయాణం

అనంతపురంరూరల్‌, సెప్టెంబరు 9: ఆ రోడ్డు నిత్యం రద్దీతో ఉంటుంది. గ్రామాల నుంచి వివిధ పనులు నిమిత్తం వచ్చేవారు కొందరైతే... జిల్లా కేంద్రం నుంచి కళాశాలలు, గ్రామాలకు వెళ్లే వారు మరికొందరు. వందల వాహనాలు ఆ రోడ్డుపై నిత్యం రాకపోకలు సాగిస్తుంటాయి. అలాంటి రోడ్డు నిర్మాణంలో జాప్యం జరుగుతోంది. రోడ్డు నిర్మాణం చేపట్టి మూడేళ్లు అవుతోంది. గత ప్రభుత్వ పెద్దలు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఎన్నికల సమీస్తున్న తరుణంలో ఉన్న రోడ్డును ఇష్టారాజ్యంగా తవ్వేశారు. ఆ తరువాత కొంత రోడ్డు నిర్మించారు. అనంతరం లావుసైజు కంకర పరిచి వదిలేశారు. ఇది జరిగి ఏడాది కావస్తోంది. ఇదీ రుద్రంపేట ప్రధాన రోడ్డు దుస్థితి. రోడ్డు నిర్మాణంలో నెలకొన్న జాప్యం కరణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు పక్క ఉంటున్న వారు దుమ్ముధూళితో సహజీవనం చేస్తున్నారు.


అసంపూర్తిగా రోడ్డు నిర్మాణ పనులు

రుద్రంపేట ప్రధాన రోడ్డు నిర్మాణ పనులు ఎక్కడిఎక్కడ నిలిచిపోయాయి. రోడ్డు పొడవునా పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. సర్కిల్‌లో నుంచి వంద మీటర్లు రోడ్డు వేశారు. ఈ రోడ్డుకు మధ్యలో డివైడర్‌ నిర్మించకుండా వదిలేశారు. ఇక మిగిలిన రోడ్డు అంతా అధ్వానంగా ఉంది. దీనికితోడు మరికొంత భాగం నిర్మాణం కోసం పెద్ద కంకర పరిచారు. అలాగే రోడ్డు మధ్యలోనే విద్యుత స్తంభాలున్నాయి. వాటిని మార్పు చేయాల్సి ఉంది.

దమ్ము ధూళీతో సహ జీవనం..

రోడ్డు నిర్మాణ పనులు అసంపూర్తిగా నిలిచిపోవడంతో వాహనదారుల అవస్థలు వర్ణనాతీతం. జిల్లా కేంద్రానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి గ్రామస్థులు, ఉద్యోగులు రాకపోకలు సాగిస్తున్నారు. జిల్లా కేంద్రం నుంచి కళాశాలలకు విద్యార్థులు నిత్యం వెళ్లివస్తున్నారు. రోడ్డు నిర్మాణం కారణంగా పాత రోడ్డును తవ్వి వదిలేశారు. దీంతో పెద్ద గుంతలు పడ్డాయి. వర్షం వచ్చిందంటే ఎక్కడ ఎ గుంత ఉందో, ఎందులో పడతామేమోనని వాహనదారులు భయపడిపోతున్నారు. మిగతా సమయంలో రోడ్డుపై లేస్తున్న దుమ్ముధూళి మధ్య రాకపోకలు సాగిస్తూ అవస్థలు పడుతున్నారు. రోడ్డుకు ఇరువైపుల దుకాణదారులు, స్థానికంగా నివాసముంటున్నా వారి ఇబ్బందులు చెప్పక్కర్లేదు. ఈ రోడ్డు ఏ ముహుర్తంలో మొదలు పెట్టారో కాని.. నిత్యం ఇబ్బందులు పడుతున్నామంటూ సానిఇకులు మండి పడుతున్నారు.


నిత్యం ఇబ్బందులు పడుతున్నాం

రోడ్డు నిర్మాణంతో మూడేళ్లుగా ఇబ్బంది పడుతున్నాం. నిత్యం వాహనాల రాకపోకల కారణంగా దుమ్ము, ధూళీ పెద్ద ఎత్తున లేస్తోంది. అది కాస్త ఇళ్లలోకి, దుకాణాల్లోకి వచ్చి చేరుతోంది. ఆ దుమ్ము, ధూళీని తొలగించుకునేందుకే నానా అవస్థలు పడుతున్నాం. సమస్య ఎప్పటికి తీరుతుందో?

- నాగేంద్ర, హోటల్‌ నిర్వాహకుడు, చంద్రబాబు కొట్టాల

ఉండలేని పరిస్థితి

ఎనిమిదేళ్లుగా స్థానికంగా హోటల్‌ పెట్టుకుని జీవనం సాగిస్తున్నా. రోడ్డు పనులు పూర్తికాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. రోడ్డుపై లేచే దుమ్ము,ధూళీ కారణంగా స్థానికంగా ఉండలేని పరిస్థితి. రోడ్డు నిర్మాణం ప్రారంభం నుంచి ఇబ్బందులు పడుతున్నాం. ప్రజాప్రతినిధులు స్పందించి సమస్యను పరిష్కరించాలి.

- కుళ్లాయప్ప, మదీనా హోటల్‌, రుద్రంపేట

Updated Date - Sep 10 , 2024 | 12:08 AM