Share News

సీఐడీ ఎటాచమెంట్‌లోని భూమిని ఎలా కొంటారు..?

ABN , Publish Date - Aug 15 , 2024 | 12:17 AM

సీఐడీ ఎటాచమెంట్‌లోని అగ్రిగోల్డ్‌ భూమిని ఎలా కొంటారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్‌ ప్రశ్నించారు. బుధవారం స్థానిక టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ హయాంలో మాజీ మంత్రి జోగి రమేష్‌ కుటుంబ సభ్యులు అధికారాన్ని అడ్డుపెట్టుకొని చేసిన అక్రమాలు ఒక్కొక్కటీ బయటకు వస్తున్నాయన్నారు.

సీఐడీ ఎటాచమెంట్‌లోని భూమిని ఎలా కొంటారు..?

అనంతపురం అర్బన, ఆగస్టు 14: సీఐడీ ఎటాచమెంట్‌లోని అగ్రిగోల్డ్‌ భూమిని ఎలా కొంటారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్‌ ప్రశ్నించారు. బుధవారం స్థానిక టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ హయాంలో మాజీ మంత్రి జోగి రమేష్‌ కుటుంబ సభ్యులు అధికారాన్ని అడ్డుపెట్టుకొని చేసిన అక్రమాలు ఒక్కొక్కటీ బయటకు వస్తున్నాయన్నారు. విజయవాడ రూరల్‌లోని అంబాపురం గ్రా మంలో సీఐడీ ఎటాచమెంట్‌లోని అగ్రిగోల్డ్‌ భూమిని మాజీ మంత్రి జోగి రమేష్‌ కుమారుడు జోగి రాజు, బాబాయ్‌ జోగి వెంకటేశ్వరరావు పేర్ల మీద కొనుగోలు చేశారన్నారు. ఈ అక్రమాలపై అగ్రిగోల్డ్‌ సంస్థ ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు దర్యాప్తు చేసి జోగి రాజును అదుపులోకి తీసుకున్నారన్నారు. చట్టబద్దంగా జోగి రాజును అరెస్టు చేస్తే, తన కుమారుడు బీసీ బిడ్డను అన్యాయంగా అరెస్టు చేశారంటూ మాజీ మంత్రి కపటనాటకాలు ఆడటం దారుణమన్నారు. వైసీపీ హయాంలో బీసీల హత్యలు, దాడులు జరిగినప్పుడు బీసీలు గుర్తుకు రాలేదా అని నిలదీశారు.

Updated Date - Aug 15 , 2024 | 12:17 AM