Share News

Hurricane disaster గాలివాన బీభత్సం

ABN , Publish Date - Oct 23 , 2024 | 12:53 AM

మండలంలో సోమవారం గాలివాన బీభత్స సృష్టించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. 25.6 మి.మీ.ల వర్షపాతం నమోదైంది.

Hurricane disaster  గాలివాన బీభత్సం

- బ్రాహ్మణపల్లిలో 80 ఎకరాల్లో నేలకొరిగిన వరి

- రైతన్నలకు అపారనష్టం

బెళుగుప్ప, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): మండలంలో సోమవారం గాలివాన బీభత్స సృష్టించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. 25.6 మి.మీ.ల వర్షపాతం నమోదైంది.


దీంతో బ్రాహ్మణపల్లిలో ఈదురుగాలులకు 80 ఎకరాల్లో వరి పంట నేలకొరిగి అపార నష్టం వాటిల్లింది. కోనపురంలో టమాట పంట నీటమునిగిపోవడంతో కాయలు దెబ్బతిన్నాయి. దుద్దేకుంటలో 20 ఎకరాలలో మిరపపంట నీటమునిగింది. చేతికొచ్చిన పంటలు నాశనమయ్యాయని ఆయా రైతులు వాపోయారు. ప్రభుత్వం ఆదుకోవాలంటూ కోరారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం...

Updated Date - Oct 23 , 2024 | 12:53 AM