Tungabhadra water : వచ్చేశాయ్
ABN , Publish Date - Jul 23 , 2024 | 11:30 PM
తుంగభద్ర జలాలు జిల్లా సరిహద్దులోకి ప్రవేశించాయి. జలాశయం నుంచి నీటిని సోమవారం ఉదయం ఎగువ కాలువ (హెచ్చెల్సీ)కి విడుదల చేశారు. దీంతో మంగళవారం రాత్రి 7.30 గంటలకు ఆంధ్రా సరిహద్దు బొమ్మనహాళ్ వద్ద 105.272 కి.మీ. రెగ్యులేటర్ వద్దకు నీళ్లు వచ్చాయి. దీంతో హెచ్చెల్సీ అధికారులు, ఆయకట్టు రైతులు పూజలు చేసి స్వాగతం పలికారు. జలాశయంలో ఎగువకాలువ(హెచ్చెల్సీ)కి నీరు విడుదల చేసినపుడు మూడు లేదా నాలుగురోజులకు నీరు ఆంధ్రా సరిహద్దుకు చేరేవి. అయితే కర్ణాటకలో హెచ్చెల్సీ
జిల్లా సరిహద్దుకు చేరిన తుంగభద్ర జలాలు
బొమ్మనహాళ్, జూలై 23: తుంగభద్ర జలాలు జిల్లా సరిహద్దులోకి ప్రవేశించాయి. జలాశయం నుంచి నీటిని సోమవారం ఉదయం ఎగువ కాలువ (హెచ్చెల్సీ)కి విడుదల చేశారు. దీంతో మంగళవారం రాత్రి 7.30 గంటలకు ఆంధ్రా సరిహద్దు బొమ్మనహాళ్ వద్ద 105.272 కి.మీ. రెగ్యులేటర్ వద్దకు నీళ్లు వచ్చాయి. దీంతో హెచ్చెల్సీ అధికారులు, ఆయకట్టు రైతులు పూజలు చేసి స్వాగతం పలికారు.
జలాశయంలో ఎగువకాలువ(హెచ్చెల్సీ)కి నీరు విడుదల చేసినపుడు మూడు లేదా నాలుగురోజులకు నీరు ఆంధ్రా సరిహద్దుకు చేరేవి. అయితే కర్ణాటకలో హెచ్చెల్సీ ఆధునికీకరణ పనులు చేయడంతో నీరు వేగంగా ఆంధ్రా సరిహద్దుకు చేరింది. ప్రస్తుతం జలాశయం నుంచి 2,304 క్యూసెక్కులు హెచ్చెల్సీకి వస్తున్నట్లు అధికారు లు తెలిపారు. ఆంధ్రా సరిహద్దుకు 500 క్యూసెక్కులు నీరు చేరుతోంది. బుధవా రం రాత్రికి కణేకల్లు చెరువుకు నీరు చేరుతాయని అధికారులు అన్నారు. ప్రస్తుతం తుంగభద్ర జలాశయానికి 92,636 క్యూసెక్కుల వరద వస్తోంది. డ్యాంలో 92.01 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయని అధికారులు అన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....