Home » Tungabhadra
కొప్పళ జిల్లా ప్రజల జీవనాడి తుంగభద్ర నది(Tungabhadra River) రోజు రోజుకూ కలుషితమవుతోంది. సాగు, తాగు నీరందించే నది పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నదిలో ఎక్కడ చూసినా చెత్తకుప్పలతో నిండిపోతోంది.
తుంగభద్ర(Tungabhadra) జలాశయానికి సంబంధించిన 33 క్రస్ట్ గేట్లను తప్పనిసరిగా మార్చాలని బోర్డు తీర్మానించింది. క్రస్ట్ గేట్ల సామర్థ్యంపై జాతీయస్థాయి కంపెనీలతో సమగ్ర తనిఖీలు నిర్వహించి ప్రతిపాదనలను సిద్ధం చేసేందుకు బోర్డు సమావేశం నిర్ణయించింది.
ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల జీవనాడి అయిన తుంగభద్ర(Tungabhadra) జలాశయంలో నీరు రోజురోజుకు రంగుమారుతోంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్‌లో అల్పపీడనం వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులు ఈ కలుషిత నీటి వల్ల రబీ పంటలో కూడా దెబ్బతింటాయేమోనని ఆందోళన చెందుతున్నారు.
కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల రైతులకు జీవధారగా ఉన్న తుంగభద్ర(Tungabhadra) జలాశయానికి వరద పోటెత్తుతోంది. ఇటీవల కురుస్తున్న వర్షాలతో జలాశయానికి నీరు ఉధృతంగా చేరుతోంది. జలాశయం నిల్వ సామర్థ్యానికి మించి నీరు చేరుతుండడంతో క్రస్ట్‌గేట్లు తెరిచి నీటిని నదికి వదులుతున్నారు.
తుంగభద్ర ప్రాజెక్టును ఈ నెల 9, 10 తేదీలలో నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎనడీఎ్‌సఏ) నియమించిన నిపుణుల కమిటీ సందర్శించనుంది. గత నెల 10న చైన లింగ్ తెగిపోయి వరద ఉధృతికి కొట్టుకుపోయిన 19వ నంబరు క్రస్ట్‌గేట్‌తో పాటుగా మిగిలిన 32 క్రస్ట్‌గేట్ల భద్రత, ఇతర అంశాల అధ్యయనం కోసం ఈ బృందం వస్తోంది. జాతీయ జలాశయాలు భద్రతా సంస్థ, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) మాజీ చైర్మన ఏకే బజాజ్ నేతృత్వంలో ఢిల్లీకి చెందిన రిటైర్డ్ మెకానికల్ ఇంజనీరింగ్ నిపుణుడు హర్కేశ ...
వర్షాలు బాగా కురిశాయి. తుంగభద్ర జలాశయం శరవేగంగా నిండింది. ఆయకట్టు రైతులు పంటల సాగుకు సిద్ధమయ్యారు. ఇంతలోనే అనుకోని విపత్తు..! గత నెల పదో తేదీ రాత్రి డ్యాం 19 క్రస్ట్‌గేట్ కొట్టుకుపోయింది. అప్పటికి డ్యాం నిల్వలు గరిష్ఠ స్థాయిలో ఉన్నాయి. నీరు మొత్తం నదిలోకి వెళుతోంది. డ్యాం ఖాళీ అయితే పరిస్థితి ఏమిటని అందరిలో ఆందోళన..! క్షణం వృథా చేయకుండా ఏపీ, కర్ణాటక ప్రభుత్వాలు స్పందించాయి. క్రస్ట్ గేట్ల నిపుణుడు కన్నయ్య నాయుడును సీఎం...
తుంగభద్ర(Tungabhadra)కు వరద పోటెత్తుతోంది. జలాశయంలో కెరటాలు ఎగసిపడుతున్నాయి. డ్యాం 19వ క్రస్ట్ గేటు విరిగిపోవడంతో నీరు వృథాగా పోయి అన్నదాత ఆవేదన పడిన సంగతి తెలిసిందే. వారం రోజులుగా ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో డ్యాంలో మళ్లీ జలకళ ఉప్పొంగుతోంది.
రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఈనెల 31 వరకు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
కర్ణాటకలోని తుంగభద్ర డ్యాం 19వ గేటు స్థానంలో అమర్చిన స్టాప్‌లాగ్‌లో లీకేజీని ఆదివారం పూర్తిగా అరికట్టారు. సిమెంటు, స్టోన్‌పౌడర్, బెల్లంతో తయారు చేసిన మిశ్రమాన్ని నీరు లీక్‌అవుతున్న చోట అతికించారు.
‘తుంగభద్ర’కు నీటి భరోసా దక్కింది. ‘ఆపరేషన్ స్టాప్‌లాగ్’ వందశాతం విజయవంతమైంది. కరువు సీమ రైతుల ఖరీఫ్ ఆశ సజీవంగా నిలిచింది.