MLA SUNITHA: ఇలాంటి పరిస్థితి రానివ్వను
ABN , Publish Date - Aug 22 , 2024 | 12:21 AM
వర్షం నీటితో వస్తున్న ఇబ్బందుల నుంచి కాలనీ వాసులను కాపాడుకుంటామని ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. మండలంలోని అక్కంపల్లి పంచాయతీ సదాశివన కాలనీలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వంక ఉధృతంగా పారుతోంది.
ఎమ్మెల్యే పరిటాల సునీత
అనంతపురంరూరల్, ఆగస్టు 21: వర్షం నీటితో వస్తున్న ఇబ్బందుల నుంచి కాలనీ వాసులను కాపాడుకుంటామని ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. మండలంలోని అక్కంపల్లి పంచాయతీ సదాశివన కాలనీలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వంక ఉధృతంగా పారుతోంది. కాలనీలోకి వెళ్లేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం మధ్యాహ్నం ఎమ్మెల్యే పరిటాల సునీత పంచాయతీ రాజ్ ఇతర విభాగాల అధికారులతో కాలనీలోకి వెళ్లారు. వంకనుంచి వస్తున్న నీటిని పరిశీలించారు. స్థానికులు తమ ఇబ్బందులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. కాలనీలో నుంచి వెళ్లేందుకు మార్గం లేక పిల్లలను రెండు రోజులుగా స్కూల్ కూడా పంపించలేదని చెప్పుకొచ్చారు. సమస్య పరిష్కారానికి తీసుకోవాలసిన చర్యలపై అధికారులతో మాట్లాడారు. కలెక్టర్ దృష్టి సమస్యను తీసుకెళ్లారు. ఆమె మాట్లాడుతూ కాలనీలో వర్షపు నీటి శాశ్వత పరిష్కారం చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. రూ.30లక్షల నిధులతో ఇక్కడ పనులు చేపడుతామన్నారు. అందుకు ప్రణాళికలు తయారు చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. వచ్చే వర్షాకాలంలోపు ఈసమస్య లేకుండా చేస్తామని చెప్పారు. మండల కన్వీనర్ జింకాసూర్యనారాయణ, మాజీ జడ్పీటీసీ వేణుగోపాల్, పామురాయి రఘు, చల్లాజయకృష్ణ, వెంకటనారాయణ, ప్రదీ్‌పకుమార్, అంజనరెడ్డి,మస్తాన, ఫకృద్దీన పాల్గొన్నారు.
టమోటా రైతులకు గిట్టుబాటు ధర కల్పించండి: టమోటా రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఏపీ రైతు సంఘం జిల్లా కమిటీ నాయకులు కోరారు. ఆమేరకు ఎమ్మెల్యే పరిటాల సునీతను కలసి వినతి పత్రం ఇచ్చారు. నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వమే టమోటా మార్కెట్ ఏర్పాటు చేసి రైతులకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా చూడాలన్నారు. ప్రస్తుతం కక్కలపల్లిటమోటా మార్కెట్‌లో పది శాతం కమీషన కాకుండా నాలుగుశాతం తీసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో టమోటాకు అనుబంధంగా పరిశ్రమలు ఏర్పాటు చేయాలన్నారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, నాయకులు పోతులయ్య, రాప్తాడు చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.