GOD: ఆలయంలో ప్రతిష్ఠించిన విగ్రహాలు
ABN , Publish Date - Aug 13 , 2024 | 12:06 AM
వీరశైవ లింగాయత సంఘం ఆధ్వర్యంలో మండలంలోని ఆమిదాలగొంది గ్రామంలో నూతనంగా నిర్మిం చిన శివాలయంలో విగ్రహ ప్రతిష్ఠ ఉత్సవాలను సోమవారం వైభవంగా నిర్వహించారు. వేకువజాము నుంచి వేదపండితులు హోమాలు చేశారు. ఆలయంలో శివలింగం, పార్వతి, సుబ్రహ్మణ్యేశ్వర, నందీశ్వర విగ్రహాలను ప్రతిష్ఠించారు. అలాగే ధ్వజ స్తంభం, విమానగోపురం కలశ స్ధాపన చేశారు. మందుగా మహిళలు కలశాలతో ఊరేగిం పుగా వచ్చి ఆలయ ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శించుకోన్నారు.
ఘనంగా విగ్రహ ప్రతిష్ఠ
మడకశిర రూరల్, ఆగస్టు 12: వీరశైవ లింగాయత సంఘం ఆధ్వర్యంలో మండలంలోని ఆమిదాలగొంది గ్రామంలో నూతనంగా నిర్మిం చిన శివాలయంలో విగ్రహ ప్రతిష్ఠ ఉత్సవాలను సోమవారం వైభవంగా నిర్వహించారు. వేకువజాము నుంచి వేదపండితులు హోమాలు చేశారు. ఆలయంలో శివలింగం, పార్వతి, సుబ్రహ్మణ్యేశ్వర, నందీశ్వర విగ్రహాలను ప్రతిష్ఠించారు. అలాగే ధ్వజ స్తంభం, విమానగోపురం కలశ స్ధాపన చేశారు. మందుగా మహిళలు కలశాలతో ఊరేగిం పుగా వచ్చి ఆలయ ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శించుకోన్నారు.
విగ్రహ ప్రతిష్ఠ కార్య క్రమానికి ఎంపీ పార్థసారఽఽథి, రాష్ట టీడీపీ ఉపాధ్యక్షులు గుండుమల తిప్పేస్వామి, మాజీ ఎమ్మెల్యేలు ఈరన్న వైటీ ప్రభాకర్ రెడ్డి, సీడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరారెడ్డి, కర్ణాటక సిద్దరబెట్ట పీఠాధిపతి వీరభద్ర శివాచార్యలు, జపానంద స్వామి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వా రు ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం ఆలయ ఆవరణలో ఏ ర్పాటుచేసిన సమావేశంలో సిద్దరబెట్ట వీరభద్ర శివాచార్య స్వామీజీ మాట్లాడుతూ ప్రతిఒక్కరూ ఆధ్యాత్మక చింతనను అలవరచుకోవాలని సూచించారు. అప్పుడే వరుణదేవుడు కరుణిస్తాడన్నారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....