Share News

PVKK COLLEGE: ఫ్యాకల్టీ డెవల్‌పమెంట్‌ ప్రోగ్రాం ప్రారంభం

ABN , Publish Date - Aug 27 , 2024 | 12:18 AM

నగర శివారులోని పీవీకేకేఐటీలో ఎలకి్ట్రక్‌ వెహికల్‌ టెక్నాలజీ అనే అంశంపై ఫ్యాకల్టీ డెవల్‌పమెంట్‌ శిక్షణ కార్యక్రమం(ఎ్‌ఫడీపీ) సోమవారం ప్రారంభమైంది. కార్యక్రమానికి ముఖ్యఅథితులుగా జేఎనటీయూ కళాశాల డా. విజయక్‌కుమార్‌ హాజరయ్యారు.

PVKK COLLEGE: ఫ్యాకల్టీ డెవల్‌పమెంట్‌ ప్రోగ్రాం ప్రారంభం
Principal honoring the Chief Guest

అనంతపురంరూరల్‌, ఆగస్టు 26: నగర శివారులోని పీవీకేకేఐటీలో ఎలకి్ట్రక్‌ వెహికల్‌ టెక్నాలజీ అనే అంశంపై ఫ్యాకల్టీ డెవల్‌పమెంట్‌ శిక్షణ కార్యక్రమం(ఎ్‌ఫడీపీ) సోమవారం ప్రారంభమైంది. కార్యక్రమానికి ముఖ్యఅథితులుగా జేఎనటీయూ కళాశాల డా. విజయక్‌కుమార్‌ హాజరయ్యారు. విద్యుత వాహనాల సాంకేతికత భవిష్యత్తులో ఎంతటి పాత్ర పోషిస్తాయన్న విషయాలను వివరించారు. మోహనబాబు యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్‌ ప్రభు విద్యుత వాహనాల సాంకేతికతలో తాజా పరిజ్ఞానాన్ని విద్యార్థులకు, పరిశోధకులకు, అధ్యాపకులకు పరియయం చేయడానికి, పరిశ్రమలలోని నూతన పరిణామాలను తెలుసుకోవడానికి మంచి వేదికన్నారు. కాకినాడ జేఎనటీయూ డా. శివనాగరాజు విద్యుత వాహనాల టెక్నాలజీపై వివరించారు. కళాశాల ప్రిన్సిపాల్‌ బండిరమే్‌షబాబు, యాజమాన్య ప్రతినిధి శ్రీకాంతరెడ్డి, వైస్‌ ప్రిన్సిపాల్‌ దీప్తి జోర్డాన, ఏఓ మనోహర్‌రెడ్డి, ఎఫ్‌డీపీ కన్వీనర్‌ శ్రీనివాసన, కో-కన్వీనర్‌ హరిప్రసాద్‌, ఆర్గానైజింగ్‌ కార్యదర్శి మహే్‌షకుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Aug 27 , 2024 | 12:18 AM