Share News

Incharge Collector పకడ్బందీగా పింఛన్ల పంపిణీ

ABN , Publish Date - Dec 30 , 2024 | 11:27 PM

ఈ నెల ఒక రోజు ముందే చేపట్టిన సంక్షేమ పింఛన్లు పంపిణీని పకడ్బందీగా నిర్వహించాలని ఇనచార్జ్‌ కలెక్టర్‌ శివనారాయణశర్మ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనలో సోమవారం ప్రజా ఫిర్యాదుల వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు.

Incharge Collector పకడ్బందీగా పింఛన్ల పంపిణీ

ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలోనూ ముందుండాలి

ఇనచార్జ్‌ కలెక్టరు శివనారాయణశర్మ

అనంతపురం టౌన, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): ఈ నెల ఒక రోజు ముందే చేపట్టిన సంక్షేమ పింఛన్లు పంపిణీని పకడ్బందీగా నిర్వహించాలని ఇనచార్జ్‌ కలెక్టర్‌ శివనారాయణశర్మ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవనలో సోమవారం ప్రజా ఫిర్యాదుల వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధప్రాంతాల నుంచి 306మంది బాధితులు వచ్చి తమ సమస్యలపై అర్జీలు ఇచ్చారు. ఇనచార్జ్‌ కలెక్టరుతోపాటు అసిస్టెంట్‌ కలెక్టరు వినూత్న, డీఆర్‌ఓ మలోల, డిప్యూటీ కలెక్టర్లు తిప్పేనాయక్‌, ఆనంద్‌, శిరీష, వ్యవసాయశాఖ జేడీ ఉమామహేశ్వరమ్మ తదితరులు అర్జీలు స్వీకరించారు. అనంతరం అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఇనచార్జ్‌ కలెక్టరు మాట్లాడుతూ ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లు ఈనెల 31నే పంపిణీ చేయడానికి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇందుకు అవసరమైన నిధులు ముందుగానే బ్యాంకులలో డ్రా చేసుకొని ఉంచుకోవాలని సూచించారు. ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

అర్జీల పరిష్కారంలో వ్యవసాయశాఖ ఫస్ట్‌

ప్రజా ఫిర్యాదుల వేదికకు వచ్చే అర్జీల పరిష్కారంలో వ్యవసాయశాఖ మొదటిస్థానంలో ఉందని ఇనచార్జ్‌ కలెక్టరు శివనారాయణశర్మ తెలిపారు. రెండో స్థానంలో పబ్ల్లిక్‌హెల్త్‌, మూడోస్థానంలో పంచాయతీరాజ్‌శాఖ, నాలుగోస్థానంలో విద్యుతశాఖ, ఐదోస్థానంలో హౌసింగ్‌శాఖ ఉన్నాయన్నారు. ఇతరశాఖలుకూడా పోటీపడి అర్జీల పరిష్కారంలో చిత్తశుద్ధి కనబరచాలన్నారు. పోలీసు శాఖకు సంబంధించిన ఫిర్యాదులను ఓపెన చేయలేదని వెంటనే వాటిని ఓపెన చేసి పరిష్కరించాలని సూచించారు. సహకారసంఘాల సభ్యుల ఈకేవైసీ ప్రక్రియ బుధవారంలోగా పూర్తికావాలన్నారు. కంబదూరు, యాడికి మండలాలు వెనుకబడి ఉన్నాయని అక్కడ ప్రత్యేక దృష్టిపెట్టాలని ఆదేశించారు. ఈసమావేశంలో సీపీఓ అశోక్‌కుమార్‌, జడ్పీ సీఈఓ రామచంద్రారెడ్డితోపాటు పలుశాఖల అధికారులు పాల్గొన్నారు.

మాజీ ప్రధాని మన్మోహనసింగ్‌కు ఘననివాళి

భారతదేశ మాజీ ప్రధానమంత్రి మన్మోహనసింగ్‌ మృతికి జిల్లా అధికార యంత్రాంగం సోమవారం ఘనంగా నివాళులర్పించింది. రెవెన్యూభవనలో ఇనచార్జ్‌ కలెక్టరు శివనారాయణశర్మ, అసిస్టెంట్‌ కలెక్టరు వినూత్న, డీఆర్‌ఓ మలోలతో పాటు ఇతరజిల్లా ఉన్నతాధికారులు నిమిషం పాటు మౌనం పాటించి శ్రద్ధాంజలి ప్రకటించారు.

Updated Date - Dec 30 , 2024 | 11:27 PM