Share News

COLLECTOR: కౌంటర్లు పెంచి అమ్మకాలు రెట్టింపు చేయాలి

ABN , Publish Date - Aug 02 , 2024 | 11:48 PM

ప్రభుత్వం సరసమైన ధరలకు అందిస్తున్న కందిపప్పు, బియ్యం అమ్మకాల కౌంటర్లను పెంచి విక్రయాలను రెట్టింపు చేయాలని కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ సూచించారు. ప్రజలకు సరసమైన ధరలకే కందిపప్పు, బియ్యం తదితర సరకులను అందించాలని కూటమి ప్రభుత్వం ప్రత్యేక కౌంటర్లను పౌరసరఫరాలశాఖ ద్వారా ఏర్పాటు చేయించి అమ్మకాలు చేయిస్తోంది.

COLLECTOR: కౌంటర్లు పెంచి అమ్మకాలు రెట్టింపు చేయాలి
Collector Vinod Kumar inspecting the sale of subsidized goods set up in the farmers market

అనంతపురం, టౌన/రూరల్‌, ఆగస్టు 2: ప్రభుత్వం సరసమైన ధరలకు అందిస్తున్న కందిపప్పు, బియ్యం అమ్మకాల కౌంటర్లను పెంచి విక్రయాలను రెట్టింపు చేయాలని కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ సూచించారు. ప్రజలకు సరసమైన ధరలకే కందిపప్పు, బియ్యం తదితర సరకులను అందించాలని కూటమి ప్రభుత్వం ప్రత్యేక కౌంటర్లను పౌరసరఫరాలశాఖ ద్వారా ఏర్పాటు చేయించి అమ్మకాలు చేయిస్తోంది. అందులో భాగంగా జిల్లాకేంద్రంలోని రైతుబజారులో ఏర్పాటు చేసిన అమ్మకాల కౌంటర్‌ను కలెక్టర్‌ శనివారం పరిశీలించారు. కౌంటర్లలో ఉంచిన కందిపప్పు, బియ్యం, ఇతరసరకుల నాణ్యతను ఆయన పరిశీలించారు. బయటున్న ధర, ఇక్కడ ఇస్తున్న ధరలు గురించి అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ కౌంటర్లు పెంచి సరకుల అమ్మకాలు పెంచాలన్నారు. జిల్లాలో అన్నినియోజకవర్గాలు కలిపి 51 ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటుచేసి సరకులు ప్రజలకు సరసమైన ధరలకు అందించాలని డీఎ్‌సఓ, మార్క్‌ఫెడ్‌ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీఎ్‌సఓ శోభారాణి, ఇనచార్జి ఆర్డీఓ వసంతబాబు మార్కెటింగ్‌ ఏడీ సత్యనారాయణచౌదరి పాల్గొన్నారు.

ఉద్యాన, ఏపీఎంఐపీ కార్యాలయాల తనిఖీ

అనంతపురం అర్బన: జిల్లా ఉద్యాన శాఖ, ఏపీఎంఐపీ కార్యాలయాలతోపాటు ఉద్యాన శిక్షణా కేంద్రాన్ని కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. అనంతరం ఆయా శాఖల అధికారులకు కలెక్టర్‌ పలు ఆదేశాలు జారీ చేశారు. ఉద్యాన, ఏపీఎంఐపీ శాఖల ద్వారా రైతులకు మెరుగైన సేవలు అందించాలన్నారు. కార్యాలయాలకు ఐఎ్‌సఓ సర్టిఫికెట్‌ వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉద్యానశాఖ ఇనచార్జి అధికారి నరసింహారావు, ఏపీఎంఐపీ పీడీ రఘునాథ్‌రెడ్డి, ఏపీడీ ఫిరోజ్‌ ఖాన, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Aug 02 , 2024 | 11:48 PM